న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌కు దక్కిని చోటు, భారత్ నుంచి ఇద్దరు: మోర్గాన్ జట్టు ఇదే

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టులో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. భారత్ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే చోటు కల్పించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టులో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. భారత్ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే చోటు కల్పించాడు. ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్‌ అలెస్టర్ కుక్‌ని తన జట్టుకి కెప్టెన్‌గా ఎంచుకున్నాడు.

అయితే ఇయాన్ మోర్గాన్ ప్రకటించిన ఆల్ టైమ్ ఎలెవన్ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సచిన్ బ్యాటింగ్ శైలిని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ సైతం కొనియాడిన సంగతి తెలిసిందే.

భారత్ నుంచి ఎంపిక చేసిన వారిలో మహేంద్ర సింగ్ ధోని, అనిల్ కుంబ్లేలు మాత్రమే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు (వన్డేల్లో 49, టెస్టుల్లో 51) ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ సచిన్ ఒక్కడే. మొత్తంగా చూస్తే క్రికెట్‌లో 33,000 పరుగులను సచిన్ పూర్తి చేశాడు.

 MS Dhoni, Anil Kumble feature in Eoin Morgan's all-time XI; no place for Sachin Tendulkar

ఇక ఇయాన్ మోర్గాన్ ఎంపిక చేసిన ఆల్ టైమ్ ఎలెవన్ జట్టులో ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, మిచెల్ జాన్సన్‌లు ఉండగా, వెస్టిండిస్ నుంచి బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్‌లు ఉన్నారు. ఇక శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర సైతం మోర్గాన్ జట్టులో చోటు ఉన్నాడు.

ఇక ఇంగ్లాండ్ జట్టు నుంచి కుక్‌తో పాటు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండరన్స్ ఉన్నాడు. తన ఆల్ టైమ్ ఎలెవన్ జట్టుని ప్రకటించిన సందర్భంగా మోర్గాన్ మీడియాతో మాట్లాడాడు. అలెస్టర్ కుక్, జాక్వస్ కల్లిస్‌లను ఓపెనింగ్ జోడీగా అభివర్ణించాడు. ఇక ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌ను మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

నాల్గవ స్ధానాన్ని వెస్టిండిస్ క్రికెటర్ బ్రియాన్ లారాను ఎంపిక చేశాడు. ఇక ఐదో స్ధానాన్ని ఏబీ డివిలియర్స్‌కు కేటాయించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో కుమార్ సంగక్కర, ధోని, అనిల్ కుంబ్లే, జేమ్స్ ఆండర్సన్, డేల్ స్టెయిన్, మిచెల్ జాన్సన్‌లకు కట్టబెట్టాడు.

మోర్గాన్ ఆల్ టైమ్ XI జట్టు:

1. Alastair Cook (Eng)
2. Jacques Kallis (SA)
3. Ricky Ponting (Aus)
4. Brian Lara (WI)
5. AB de Villiers (SA)
6. Kumar Sangakkara (SL)
7. MS Dhoni (Ind)
8. Anil Kumble (Ind)
9. James Anderson (Eng)
10. Dale Steyn (SA)
11. Mitchell Johnson (Aus)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X