న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సకల సౌకర్యాలతో: ధోని ప్రస్తుత ఇల్లు ఇదే (ఫోటోలు)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెకాన్ కాంప్లెక్స్ స్టాఫ్ క్వార్టర్స్‌లోని రెండు అంతస్తుల బిల్డింగ్‌లో తన కుటుంబంతో చిన్నచిన్న గదులున్న ఓ ఇంట్లో నివసించేవాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చిన్నతనాన్ని రాంచీలోని దొరందా ప్రాంతంలోని మెకాన్ కాలనీలో ఉన్న ఓ చిన్న ఇంట్లో గడిపాడు. ధోని తండ్రి పాన్ సింగ్ ధోని మెకాన్ కాంప్లెక్స్‌లో పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవాడు.

అందులో భాగంగా మెకాన్ కాంప్లెక్స్ స్టాఫ్ క్వార్టర్స్‌లోని రెండు అంతస్తుల బిల్డింగ్‌లో తన కుటుంబంతో చిన్నచిన్న గదులున్న ఓ ఇంట్లో నివసించేవారు. ఆ తర్వాత ధోని కుటుంబం జార్ఖండ్ రాజధాని రాంచీలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతానికి మకాం మార్చారు.

అయితే ధోని చిన్నతనంలో ఉన్న ఇంటిలో ప్రస్తుతం లలిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ధోని జీవిత చరిత్ర ఆధారంగా సినిమా విడుదల అవడంతో ఈ ఇంటికి బాగా ప్రాచుర్యం వచ్చింది. ఈ నేపథ్యంలో ధోని చిన్ననాటి ఇంటిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

ధోని తన చిన్నతనంలో మెకాన్ కాలనీలోని డీఏవీ జహర్ విద్యామందిర్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ ఇంటి నుంచి ధోని స్కూలుకు వెళ్లేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం పడుతుంది. ధోని తన స్కూల్ విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేశాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్కూలు ధోనికి ఓ దేవాలయం లాంటింది. ఈ స్కూల్‌ మైదానంలోనే ధోని పుట్ బాల్ ఆట నుంచి క్రికెట్ గోల్ కీపర్‌గా ఎదిగాడు. కేశాబ్ బెనర్జీ నేతృత్వంలోని క్రికెట్ ఎలా ఆడాలో కూడా ధోని ఇక్కడే నేర్చుకున్నాడు.

అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం ధోని చిన్ననాటి ఇంట్లో నివసిస్తోన్న లలిత్ సింగ్ వన్ఇండియాకు ఇంటర్యూ ఇచ్చాడు. అందులో ధోని జీవితం ఆధారంగా నిర్మించిన MS Dhoni: The Untold Story సినిమాలో ఈ ఇంటిలో షూటింగ్ కూడా తీశారని చెప్పుకొచ్చాడు.

2004లో ధోని సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత తన ఇంటి మకాంను వేరే చోటుకి మార్చాడు. మెకాన్ ఆసుపత్రికి సమీపంలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్‌ను ధోనికి బహుమతిగా ఇచ్చారు. ఇందులో ధోని కుటుంబం ఐదు సంవత్సరాలు నివసించింది.

ఇక 2009లో మెకాన్ క్వార్టర్స్ నుంచి హర్ము హౌసింగ్ కాలనీకి తన మకాం మార్చాడు. హర్ము హౌసింగ్‌లో ధోని మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. బయట నుంచి చూసేవారికి ఇదొక సాధారణ భవంతిలాగా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందులో స్మిమ్మింగ్ పూల్, నెట్ ప్రాక్టీస్ ఫీల్డ్, ఆల్ట్రా మోడ్రన్ జిమ్‌లతో పైవ్ స్టార్ హోటల్‌ను తలపిస్తుందని లలిత్ సింగ్ చెప్పాడు.

ధోని మొట్ట మొట్టది ఇల్లు

ధోని మొట్ట మొట్టది ఇల్లు

ధోని తండ్రి పాన్ సింగ్ ధోని మెకాన్ కాంప్లెక్స్‌లో పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవాడు. అందులో భాగంగా మెకాన్ కాంప్లెక్స్ స్టాఫ్ క్వార్టర్స్‌లోని రెండు అంతస్తుల బిల్డింగ్‌లో తన కుటుంబంతో చిన్నచిన్న గదులున్న ఓ ఇంట్లో నివసించేవారు.

ధోని ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు

ధోని ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు

2009లో మెకాన్ క్వార్టర్స్ నుంచి హర్ము హౌసింగ్ కాలనీకి తన మకాం మార్చాడు. హర్ము హౌసింగ్‌లో ధోని మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. బయట నుంచి చూసేవారికి ఇదొక సాధారణ భవంతిలాగా అనిపిస్తుంది.

సకల సౌకర్యాలతో ధోని ఇల్లు

సకల సౌకర్యాలతో ధోని ఇల్లు

జార్ఖండ్ రాజధాని రాంచీలోని హర్ము హౌసింగ్ కాలనీలోని ధోని ఇల్లు ఇది. ఈ ఇంటి లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందులో స్మిమ్మింగ్ పూల్, నెట్ ప్రాక్టీస్ ఫీల్డ్, ఆల్ట్రా మోడ్రన్ జిమ్‌లతో పైవ్ స్టార్ హోటల్‌ను తలపిస్తుంది.

కుక్కలంటే ధోనికి ఎంతో ప్రాణం

కుక్కలంటే ధోనికి ఎంతో ప్రాణం

మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు. ధోనికి కుక్కలంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ధోని దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన విజయ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ధోని నేతృత్వంలోని జార్ఖండ్ జట్టు ఈ ట్రోఫీలో సెమిస్‌కు చేరుకుంది. సెమీస్‌లో బెంగాల్ జట్టుతో జార్ఖండ్ జట్టు మార్చి 17న తలపడనుంది.

రాంచీలోని ధోని ఫామ్ హౌస్

రాంచీలోని ధోని ఫామ్ హౌస్

రాంచీ శివార్లలో ధోనికి ఓ ఫామ్ హౌస్ ఉంది. ఏడు ఎకరాల ప్రాంతంలో ధోని ఈ ఫామ్ హౌస్‌ని నిర్మించుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X