న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై టెస్టు, డే1: ఇంగ్లాండ్ 288/5, నమోదైన రికార్డులివే

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 94 ఓవర్లకు గాను 5 వికెట్ల నష్టానికి 288 పరుగలు చేసింది. బెన్ స్టోక్స్ 25, జోస్ బట్లర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.


తొలిరోజు ఇంగ్లాండ్ ఆటతీరు సాగిందిలా:

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 249 పరుగుల వద్ద బెయిర్ స్టో (14) అశ్విన్ బౌలింగ్‌లో యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 87 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో 6, బెన్ స్టోక్స్ 18 పరుగుతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా జడేజాకు ఒక వికెట్ లభించింది.

Bairstow

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 230 పరుగుల వద్ద సెంచరీ వీరుడు జెన్నింగ్స్ (112) అశ్విన్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 72 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లను కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో 1, బెన్ స్టోక్స్ 1 పరుగుతో ఉన్నారు. అంతక ముందు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మెయిన్ అలీ (50) అశ్విన్ బౌలింగ్‌లో నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా జడేజాకు ఒక వికెట్ లభించింది.

టీ విరామానికి ఇంగ్లాండ్ 196/2
ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు టీ విరామానికి రెండు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్ 103, మెయిన్ అలీ 25 పరుగులతో ఉన్నారు.

రికార్డు 'సెంచరీ' చేసిన జెన్నింగ్స్
నాలుగో టెస్టు మ్యాచ్‌ పలు రికార్డులకు వేదికైంది. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 89బంతులకే అర్థ సెంచరీని పూర్తి చేసుకున్న జెన్నింగ్స్‌ 186 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన 19వ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా జెన్నింగ్స్ చరిత్ర సృష్టించాడు.

Jennings

అంతేకాదు వాంఖడె స్టేడియంలో అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ముంబైలో ఇప్పటి వరకు అరంగేట్ర బ్యాట్స్‌మెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. దీంతో 61 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

రూట్ ఔట్: సెంచరీకి చేరువలో జెన్నింగ్స్

ముంబై వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ అందుకోవడంతో జోరూట్ పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న జెన్నింగ్స్ నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్ 89, మొయిన్ అలీ 9 పరుగులతో ఉన్నారు. దీంతో ఇంగ్లాండ్ 48.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తీశారు.

లంచ్ విరామానికి ఇంగ్లాండ్: 117/1

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్ 65, జో రూట్ 5 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అర్ధ సెంచరీ సాధించిన కీటన్ జెన్నింగ్స్

ముంబై టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు కీటన్ జెన్నింగ్స్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌కు చక్కటి శుభారంభానిచ్చిన జెన్నింగ్స్ 90 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ సాధించాడు. కెప్టెన్ కుక్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కౌంటీల్లో మెరుగైన రికార్డు ఉన్న జెన్నింగ్స్ భారత బౌలింగ్‌ని ఎదుర్కొని ఇంగ్లాండ్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ కౌంటీల్లో జెన్నింగ్స్ 1548 పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డుని సొంతం చేసుకున్నాడు.

England win toss, decide to bat first against India

కెప్టెన్ అలెస్టర్ కుక్ అవుట్
నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అలెస్టర్ కుక్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బంతిని ఆడేందుకు ముందుకొచ్చిన పార్థీవ్ పటేల్ స్టంపింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దాంతో కుక్-జెన్నింగ్స్ 99 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, ఈ మ్యాచ్‌లో అలెస్టర్ కుక్ మరో ఘనతను సాధించాడు. ఇప్పటివరకు భారత్‌పై రెండు వేలు అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లల్లో ఆరో ఆటగాడిగా కుక్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు పాంటింగ్‌ 2555 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్
ముంబై వేదిగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్ 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు కుక్‌, జెన్నింగ్స్‌ వీలు చిక్కినప్పుడల్లా వికెట్ల మధ్య పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో జెన్నింగ్స్‌ 25, కుక్‌ 23 పరుగులతో ఉన్నారు.

ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌‌లో భాగంగా నాలుగో టెస్టుకు ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ముంబై టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే టెస్టు సిరిస్ భారత్ సొంతమవుతుంది. ఈ టెస్టు సిరిస్‌లో భాగంగా రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాకాగా, ఆ తర్వాత విశాఖపట్న, మొహాలిలో జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించింది.

Mumbai Test: England win toss, decide to bat first against India

దీంతో భారత్‌ 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో ముందంజలో ఉంది. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ యత్నిస్తోంది. మరోవైపు కోహ్లీసేనను ఎలాగైనా నిలువరించాలనే పట్టుదలతో కుక్ సేన పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇంగ్లాండ్ జట్టులో హమీద్, వోక్స్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలు పాలైనా, వాంఖడే స్టేడియంలో గత చరిత్ర తమకు కలిసొచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ భావిస్తోంది. మోకాలి నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్‌ మహ్మద్ షమి స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ చోటు లభించింది.

జట్ల వివరాలు:

ఇండియా:

ఇంగ్లాండ్:

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X