పుజారా సమస్యకు పరిష్కారం కనుగొన్న కుంబ్లే
దీంతో హెడ్ కోచ్ కుంబ్లే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. నెట్స్‌లో పుజారాకు తానే లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించాడు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా నెట్స్‌లో పుజారాకు బౌలింగ్ చేశాడు. దీంతో బెంగుళూరు టెస్టులో ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు.
రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు లోపలికి వచ్చేలా బౌలింగ్
పుజారా చేసిన 92 పరుగులే రెండో టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ‘ఆసీస్ జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. దీంతో కుంబ్లే కూడా ఓకీఫ్ లాగే క్రీజు చివరి నుంచి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌కు లోపలికి వచ్చేలా బౌలింగ్ చేశాడు. శ్రీధర్ కూడా ‘ఓవర్ ది వికెట్' బౌలింగ్ చేశాడు' అని బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో పూజారా తెలిపాడు.
లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేసిన కుంబ్లే
'అనిల్ భాయ్ రైట్ హ్యాండర్ అయినా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. బెంగళూరు టెస్టుకు ముందు నెట్స్‌లో ఇలా సాధన చేయడం ఎంతగానో ఉపయోగపడింది' అని పుజారా తెలిపాడు. పూణె టెస్టులో ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఓకీఫ్ 12 వికెట్లు తీసుకుని 70 పరుగులిచ్చి భారత్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు.
|
ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకే ఈ తంత్రం
దీంతో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా ఈ తంత్రాన్ని ఉపయోగించింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఎడమ చేతి వాటం బౌలర్‌గా మారి నెట్స్‌లో పుజారాకు బౌలింగ్ చేసిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా మార్చి 16న భారత్, ఆసీస్‌ల మధ్య మూడో టెస్టు రాంచీలో ప్రారంభం కానుంది.