న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'లంక పర్యటనకు ముందే కొత్త కోచ్': నివేదిక కోరిన సీఓఏ

వివిధ రకాలుగా ప్రయత్నించినప్పటికీ కుంబ్లే, కోహ్లీల మధ్య విభేదాలను బీసీసీఐ పరిష్కరించలేకపోయిందని బోర్డు సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా అన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: వివిధ రకాలుగా ప్రయత్నించినప్పటికీ కుంబ్లే, కోహ్లీల మధ్య విభేదాలను బీసీసీఐ పరిష్కరించలేకపోయిందని బోర్డు సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా అన్నాడు. అయితే వచ్చే నెలలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లడానికి ముందే కొత్త కొచ్‌ని నియమిస్తామని శుక్లా చెప్పాడు.

<strong>కుంబ్లేకి ఘనమైన వీడ్కోలు: 'కోహ్లీ అహంభావమే ఇలా చేసింది'</strong>కుంబ్లేకి ఘనమైన వీడ్కోలు: 'కోహ్లీ అహంభావమే ఇలా చేసింది'

'సమస్యను పరిష్కరించడానికి బీసీసీఐ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాత్కాలిక కార్యదర్శి, సీఈఓలు కలిసి అనిల్ కుంబ్లే, కోహ్లీలతో చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఈ విషయంలో సీఓఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ను కూడా బోర్డు సంప్రదించింది' అని శుక్లా అన్నాడు.

New Indian Coach will be appointed before Sri Lanka tour: Rajeev Shukla

సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో చివరికి కుంబ్లేనే తప్పుకోవాల్సి వచ్చిందని శుక్లా తెలిపాడు. కుంబ్లే రాజీనామాను బోర్డు కూడా ధ్రువీకరించింది. 'కుంబ్లే కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు ధ్రువీకరిస్తున్నాం. కోచ్‌గా కొనసాగాలని క్రికెట్‌ సలహా కమిటీ కోరినప్పటికీ కుంబ్లే అంగీకరించలేదు. భారత జట్టు మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కుంబ్లేకు అభినందనలు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అమోఘం. భవిష్యత్తులో కుంబ్లేకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

కుంబ్లే-కోహ్లీల విషయమై నివేదిక కోరిన సీఓఏ

కుంబ్లే, కోహ్లీల మధ్య చోటు చేసుకున్న వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని జట్టు మేనేజర్ కపిల్ మల్హోత్రాను పరిపాలన కమిటీ (సీఓఏ) కోరింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీని ఆదేశించింది.

<strong>కుంబ్లేని తిట్టిన కోహ్లీ: ఫైనల్‌కు రెండు రోజుల ముందు ఏం జరిగింది?</strong>కుంబ్లేని తిట్టిన కోహ్లీ: ఫైనల్‌కు రెండు రోజుల ముందు ఏం జరిగింది?

కుంబ్లే రాజీనామాకు సంబంధించిన అంశాలపై శనివారం బీసీసీఐ బోర్డు సభ్యులతో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ చర్చించే అవకాశముంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న జోహ్రీ.. విండీస్‌ పర్యటనలో ఉన్న కపిల్ నుంచి నివేదికను తెప్పించే పనిలో ఉన్నారని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలోనే కాకుండా అంతకుముందు జరిగిన సిరీస్‌ల్లో కూడా సమస్యాత్మక పరిస్థితులు ఏమైనా తలెత్తాయా? అన్నదానిపై కూడా సీఓఏ దృష్టిసారించింది. మరోవైపు భారత్‌లో జరిగిన సిరీస్‌లకు జట్టు మేనేజర్‌గా వ్యవహరించిన అనిల్ పటేల్ ఇచ్చిన నివేదికను కూడా సీఓఏ పరిశీలించనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X