హైదరాబాద్: ప్రపంచ క్రికెట్లో ఇదొక అరుదైన సన్నివేశం. సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఎటువంటి షాట్ ఆడతాడో, ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టుగా కెప్టెన్ ఫీల్డింగ్‌ను సెట్ చేస్తుంటాడు. అంతేకాదు బౌలర్ వేసే బంతికి అనుకూలంగా వికెట్ కీపర్ కూడా వ్యవహారిస్తుంటాడు.
ఇందులో భాగంగా పిచ్‌కు దగ్గరగా ఉండే ఫీల్డర్లు బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమను దాటి తప్పించుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. కానీ 2015లో యూఏఈలో పాకిస్థాన్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఫేక్ షాట్‌తో పాక్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ను బోల్తా కొట్టించాడు.
2015లో జరిగిన ఈ టెస్టు మ్యాచ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో మిస్బావుల్ హక్ వికెట్ కీపర్‌తో పాటు స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ను ఎలా బోల్తా కొట్టించాడో చూడండి. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్ వేయగా తనపైకి వస్తున్న బంతిని స్వీప్ షాట్ కొట్టేందుకు సిద్ధమైనట్టు మిస్బా పోజు ఇచ్చాడు.
దీంతో బాట్స్మన్ కదలికను బట్టి అతడు స్వీప్ షాట్ కొడతాడని స్లిప్ లో ఉన్న ఫీల్డర్ జేమ్స్ అండర్సన్ కొంచెం లెగ్ సైడ్‌కు మారాడు. అంతేకాదు కీపర్ జాస్ బట్లర్ కూడా ముందుజాగ్రత్తగా కొద్దిగా లెగ్‌సైడ్‌కు జరిగాడు. ఇదే సమయంలో బంతిని గమనించిన మిస్బావుల్ హక్ మెరుపువేగంతో దానిని లేట్ కట్ చేశాడు.
దీంతో స్లిప్‌లో క్యాచ్ పట్టుకోవాల్సిన జేమ్స్ ఆండర్సన్ లెగ్‌సైడ్‌కు జరగడంతో అది బౌండరీగా దూసుకుపోయింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ ఆ బంతిని ఆపాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌లా మారింది. కాగా, ఈ టెస్టుని ఇంగ్లాండ్‌పై పాకిస్ధాన్ 127 పరుగులతో విజయం సాధించింది.