న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొండి చెయ్యి: ఆశ్చర్యానికి గురి చేసిన సీఏ నిర్ణయం

By Nageshwara Rao

హైదరాబాద్: వచ్చే వారంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో తొలిసారి జో మెన్నీ చోటు దక్కించుకున్నాడు. ఈ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గతేడాది నుంచి ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో జో మెన్నీ అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో 12 మంది జట్టు సభ్యులతో కూడిన బృందంలో జో మెన్నీకి చోటు కల్పించి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరిస్‌లో జో మెన్నీ చక్కగా రాణించాడు.

Pacer Joe Mennie surprise inclusion in Australia Test squad for SA series

మంచి ఎటాకింగ్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాకు ముచ్చెమటలు పట్టిన జో మెన్నీని టెస్టుల్లో కూడా ఎంపిక చేశారు. కాగా, జట్టులోకి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను కూడా తిరిగి జట్టులోకి తీసుకున్నారు. గత పన్నెండు నెలలుగా ఫస్ట్ క్లాస్‌లో నిలకడగా మెన్నీ రాణిస్తుండటంతో టెస్టుల్లో ఎంపిక చేశామని చీఫ్ సెలక్టర్ రాడ్ మార్ష్ తెలిపారు.

అతని ఎంపికకు సరైన లెంగ్త్‌‌లో బౌలింగ్ చేయడంతో పాటు, సుదీర్ఘమైన స్పెల్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేయగల సత్తా ఉన్న ఆటగాడు మెన్నీ అని మార్ష్ పేర్కొన్నాడు. దీనికి తోడు గత సీజన్ లో జరిగిన షెఫెల్డ్ షీల్డ్ టోర్నీలో మెన్నీ అత్యధిక వికెట్లు తీసుకోవడం కూడా కారణమైందని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా ఏ సిరిస్‌తో క్వీన్స్‌లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో మెన్నీ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాడని తెలిపాడు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న జాక్సన్ బర్డ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయక పోవడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X