న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిక్సింగ్‌కు పాల్పడితే మరణ శిక్ష: మియాందాద్‌ సంచలనం

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లకు మరణ శిక్ష విధించాలని అన్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లకు మరణ శిక్ష విధించాలని అన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల కఠినమైన వైఖరి ప్రదర్శించినప్పడే ఆటను రక్షించుకోగలుగుతామని అన్నారు.

<strong>మొత్తం నలుగురు: మరో పాక్ ఆటగాడిని సస్పెండ్ చేసిన పీసీబీ</strong>మొత్తం నలుగురు: మరో పాక్ ఆటగాడిని సస్పెండ్ చేసిన పీసీబీ

'పాకిస్థాన్‌ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ లాంటి సంఘటనలకు ఎందుకు శాశ్వత పరిష్కారం ఆలోచించరు' అని పీసీబీని ఉద్దేశించి మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆయన సూచించారు.

Pakistan cricket great Javed Miandad calls for death penalty for match fixers

'క్రికెట్‌లో అవినీతిని ఆపేందుకు బోర్డు ప్రతినిధులు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు కఠినమైన నిబంధనలను తీసుకోవడం లేదు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలి' అని అన్నారు. పీఎస్‌ఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలడంతో నలుగురు ఆటగాళ్లపై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసింది.

దీనిపై మియాందాద్‌ ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చాడు. అందులో బోర్డు ప్రతినిధులు కఠిన నిర్ణయాలు అమలు చేస్తే క్రికెట్‌లో అవినీతిని తరిమి కొట్టవచ్చని, ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోరు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు మరణ శిక్ష విధించాలని సూచించారు.

<strong>పాక్ క్రికెట్‌లో అలజడి: స్ఫాట్ ఫిక్సింగ్, ఇద్దరు ఆటగాళ్లపై వేటు</strong>పాక్ క్రికెట్‌లో అలజడి: స్ఫాట్ ఫిక్సింగ్, ఇద్దరు ఆటగాళ్లపై వేటు

కఠినమైన శిక్ష విధించి వారిని ఆటకు దూరంగా ఉంచితేనే క్రికెట్‌ పవిత్రంగా ఉంటుందని మియాందాద్ చెప్పుకొచ్చారు. కాగా పీఎస్ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్, మొహమ్మద్ ఇర్ఫాన్‌, హసన్‌లను పీసీబీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X