న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుంబ్లేకు పరీక్ష: జులై 21 నుంచి విండిస్‌తో తొలి టెస్ట్

By Nageshwara Rao

ఆంటిగ్వా: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా కరేబియన్ పరిస్థితులకు అలవాటు పడినట్టే కనిపిస్తోంది. అక్కడి పిచ్‌లను అర్ధం చేసుకోవడానికి ఆడిన వార్మప్ మ్యాచ్‌లు సైతం టీమిండియా ఆటగాళ్లకు బాగానే ఉపయోగుపడినట్టగానే కనిపిస్తోంది.

టెస్ట్ సిరిస్‌లో భాగంగా జులై 21 (గురువారం)న ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన అనిల్ కుంబ్లేతో పాటు కోహ్లీ కూడా టెస్టు సిరిస్ ఓ పరీక్షగా చెబుతున్నారు.

కోచ్‌గా అనిల్ కుంబ్లే టీమిండియా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆటగాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వినూత్న మార్గాన్ని అవలంభించారు. యోగా, స్విమ్మింగ్ లాంటి వాటిని ఆటగాళ్లతో చేయించారు. ప్రాక్టీసు మ్యాచ్‌ల్లో సైతం అనిల్ కుంబ్లే జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాడు.

Preview: 1st Test: West Indies Vs India in Antigua from July 21

ఇక కెప్టెన్ కోహ్లీ విషయానికి వస్తే ఈ టెస్టు సిరిస్‌ను ఎలాగైనా దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2007లో రాహుల్ ద్రవిడ్, 2011లో మహేంద్రం సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా వెస్టిండిస్‌పై టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సైతం సత్తా చాటాలని భావిస్తున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గతంలో శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0తేడాతో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే జోరును వెస్టిండిస్‌పై కొనసాగించి వరుస విజయాలను నమోదు చేయాలనే భావనలో ఉన్నాడు.

వెస్టిండిస్‌లోని స్లో పిచ్‌లు ఈ సిరిస్‌కు ఎంతో కీలకం. వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అందరినీ ఆడించి మంచిపని చేసింది. ఒక వేళ ఐదుగురు బౌలర్లతో ఆడాల్సిన పరిస్థితి వస్తే అమిత్ మిశ్రాతో పాటు స్టువర్ట్ బిన్నీతో బౌలింగ్ వేయించే ఆలోచనలో కోహ్లీ ఉన్నాడు.

ఇక ఇషాంత్ శర్మకు భాగస్వామిగా మహ్మాద్ షమీ లేదా ఉమేష్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే యోచనలో ఉన్నాడు. మరోవైపు స్పిన్‌ను ఎదుర్కొవడంలో విండిస్ బ్యాట్స్‌మెన్ తడబడతారు కాబట్టి అశ్విన్, జడేజా, మిశ్రాలను రంగంలోకి దించే అవకాశం కూడా లేకపోలేదు.

ఇక టీమిండియాలో కెప్టెన్ కోహ్లీతో పాటు ఓపెనర్ రాహుల్ అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజ్యంకె రహానేలతో భారత్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. ఇక వెస్టిండిస్ జట్టులో ఉన్న 13 మంది ఆటగాళ్లలో డారెన్ బ్రేవో 42, మార్లోన్ శామ్యూల్స్ 64 టెస్టులు ఆడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు.

వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ జాసన్ హోల్డర్ సైతం సీనియర్ ఆటగాళ్లపైనే ఆధారపడ్డారు. సెయింట్ కిట్టిస్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్లాక్ ఉడ్, రాజేంద్ర చంద్రిక మాత్రమే రాణించారు. ఇక టీమిండియాలో ఇషాంత్ శర్మ 68 టెస్టులు ఆడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు.

జట్లు:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, KL రాహుల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షామీ, ఠాకూర్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.

వెస్టిండిస్: జాసన్ హోల్డర్ (కెప్టెన్), బ్రాత్ వైట్, రాజేంద్ర చంద్రిక, డారెన్ బ్రావో, మార్లన్ శామ్యూల్స్, జెర్మైన్ బ్లాక్వుడ్, రోస్టన్ చేజ్, లియాన్ జాన్సన్, షేన్ Dowrich (వికెట్ కీపర్), దేవేంద్ర బిషూ, కార్లోస్ బ్రాత్‌వైట్, షానన్ గాబ్రియేల్, మిగ్వెల్ సుమ్మిన్స్.

Match starts at 7.30 PM IST, 10 AM Local, 2 PM GMT (LIVE on TEN Sports Network in India)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X