న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ కీలకం: బారాబతిలో మంచి రికార్డు, సిరిస్ గెలుస్తుందా?

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. గురువారం (జనవరి 19)న జరగనున్న రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. గురువారం (జనవరి 19)న జరగనున్న రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

పూణె వన్డేలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్‌ల జోడీ ఆదుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన కెరీర్‌లో 27వ సెంచరీని నమోదు చేశాడు. మరో సెంచరీ వీరుడు కేదార్ జాదవ్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీని నమోదు చేసి భారత్ తరుపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన గుర్తింపుని పొందాడు.

రెండో వన్డే కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇక్కడ టీమిండియా 15 వన్డేలాడగా అందులో 11 వన్డేల్లో విజయం సాధించింది. పూణె వన్డేలో ధోని, యువరాజ్ సింగ్‌లు విఫలమైనా మిగతా ఆటగాళ్లు రాణించడంతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.

పూణె వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ విఫలమవడం ఈ వన్డే సిరిస్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ కలిసొచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కొలుకున్న తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆశించిన మేరకు రాణించలేదు. దీంతో తుది జట్టులో చోటు స్ధానం కోసం గట్టి పోటీ నెలకొంది.

అశ్విన్‌పై కోచ్ కుంబ్లే విశ్వాసం

అశ్విన్‌పై కోచ్ కుంబ్లే విశ్వాసం

ఇక టీమిండియా టాప్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తొలి వన్డేలో ఆశించిన మేరకు రాణించలేదు. అయితే అశ్విన్‌పై కోచ్ కుంబ్లే మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే టెస్టు సిరిస్‌లో ఓటమిపాలైన ఇంగ్లాండ్, కటక్‌లో జరిగే రెండో వన్డేలో ఓటమి పాలైతే వన్డే సిరిస్‌ను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

కోహ్లీని అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్ల ఎత్తులు

కోహ్లీని అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్ల ఎత్తులు

అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఫామ్‌లో ఉన్న కోహ్లీని అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీని సాధ్యమైనంత వరకు క్రీజులో కుదురుకోనీయకుండా అడ్డుకుంటామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని ఇంగ్లాండ్ పేసర్ జేక్ బాల్ తెలిపాడు.

కోహ్లీని ఔట్ చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది

కోహ్లీని ఔట్ చేస్తే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది

కటక్‌లో జరగనున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయాలని ఇంగ్లాండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. కెప్టెన్ కోహ్లీని త్వరితగతిన పెవిలియన్‌కు పంపితే ఇంగ్లాండ్ తప్పక విజయం సాధిస్తుందని చెప్పాడు. కోహ్లీని అవుట్ చేయడానికి కొత్త ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

బారాబతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం

బారాబతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం

పూణె వన్డేలో 67 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్న బాల్ కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇక బారాబతి పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.

కీలకం కానున్న టాస్

కీలకం కానున్న టాస్

అయితే ఈ వన్డే డే-నైట్‌ మ్యాచ్‌ కావడంతో మంచు తీవ్ర ప్రభావం చూపుతుందని క్యూరేటర్‌ పట్నాయక్‌ చెప్పాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకం కానుందని, టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గు చూపొచ్చని చెప్పాడు.

‘గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో మంచు విపరీతంగా కురుస్తోంది. సాయంత్రం 5:30 నుంచే మంచు కురవడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. మ్యాచ్‌ రోజు పచ్చికపై ఏర్పడిన తేమను తొలగించేందుకు కెమికల్‌ స్ర్పే, రెండు సూపర్‌ సోపర్స్‌తోపాటు తాళ్లను కూడా వాడతామ'ని పట్నాయక్‌ తెలిపాడు.

గడ్డిని రెండు సెంటీ మీటర్ల మేర కత్తిరించాం

గడ్డిని రెండు సెంటీ మీటర్ల మేర కత్తిరించాం

అలాగే మైదానంలో గడ్డిని రెండు సెంటీ మీటర్ల మేర కత్తిరించామని కూడా ఆయన చెప్పాడు. బారాబతి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్నాడు. ‘ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు ఎంత స్కోరు సాధిస్తుందో చెప్పలేను. కానీ.. పిచ్‌ ఎప్పట్లాగే బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంద'ని పట్నాయక్‌ అన్నాడు.

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే మ్యాచ్

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే మ్యాచ్

ఇక బారాబాతి స్టేడియం విషయానికి వస్తే రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2, 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 365/5 స్కోరు చేసిన టీమిండియా అనంతరం శ్రీలంకను 169 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ విజయంతో శ్రీలంకపై 5-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

జట్లు:

జట్లు:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ధోనీ, రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, యువరాజ్ సింగ్, అజింక్య రహానె, హార్ధిక్ పాండ్య, కేదార్ జాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఉమేష్ యాదవ్.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మెయిన్ ఆలీ, బెయిర్ స్టో, జేక్ బాల్, శ్యామ్ బిలింగ్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డాసన్, అలెక్స్ హాలెస్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ ఎం, క్రిస్ వోక్స్.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X