న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై టెస్టు: డ్రాగా ముగిస్తే, ఇంగ్లాండ్ రికార్డు ఇదే

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. ముంబైలో జరగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ యత్నిస్తోంది.

మరోవైపు కోహ్లీసేనను ఎలాగైనా నిలువరించాలనే పట్టుదలతో కుక్ సేన పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో హమీద్, వోక్స్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలు పాలైనా, వాంఖడే స్టేడియంలో గత చరిత్ర తమకు కలిసొచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ భావిస్తోంది.

ముంబై టెస్టును ఇంగ్లాండ్ జట్టు డ్రాగా ముగిస్తే టెస్టు సిరిస్ భారత్ సొంతం అవుతుంది. 2011లో ఇంగ్లాండ్‌లో, 2012లో భారత్‌లో, 2014లో ఇంగ్లాండ్‌లో భారత జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. తాజా టెస్టు సిరిస్‌ను భారత్ గెలిస్తే ఆ విజయాల పరంపరకు బ్రేక్ వేసినట్లు అవుతుంది.

అయితే గతంలో వాంఖడె స్టేడియంలో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో అలాంటి ప్రదర్శనే చేసి సిరిస్‌లో పుంజుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఆరాటపడుతుంది. దీంతో వాంఖడె స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు సాధించిన అద్భుత విజయాలివే.

2012 టెస్టు మ్యాచ్

2012 టెస్టు మ్యాచ్

భారత్‌పై భారత్‌లో టెస్టు సిరిస్ గెలవాలన్న ఇంగ్లాండ్ కోరిక ఈ టెస్టు మ్యాచ్‌తో నెరవేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 వెనుకంజతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ముంబై టెస్టులో మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అద్భుత సెంచరీతో రాణించడంతో ఏకంగా పది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ కుక్ (122), పీటర్సన్ (186) సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల స్కోరు చేసింది. పనేసర్ (6/81), స్వాన్ (4/43) బౌలింగ్ విజృంభణతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో142 పరుగులకే పరిమితమైంది. దీంతో 57 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.

2006 టెస్టు మ్యాచ్

2006 టెస్టు మ్యాచ్

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అప్పటికే ఓ టెస్ట్ డ్రాగా ముగియగా, మరో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరీస్ ఓటమిని తప్పించుకునే వాంఖడే టెస్టులో ఇంగ్లాండ్ 212 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతలో ఇంగ్లాండ్ జట్టు 21 ఏళ్ల గెలుపు నిరీక్షణకు తెరపడింది. స్ట్రాస్ (128)సెంచరీకి తోడు ఓవైసీస్ షా(88) ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్(4/40) ధాటికి 279 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 191 పరుగులకు ఆలౌటైంది. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సారథ్యంలోని టీమిండియా 100 పరుగులకే ఆలౌటైంది. సచిన్(34) ఒక్కడే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.

2002 వన్డే మ్యాచ్

2002 వన్డే మ్యాచ్

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో కెప్టెన్ గంగూలీ (80) మినహా అంతా విఫలమయ్యారు. దీంతో ఆరువన్డేల సిరీస్ 3-3తో డ్రాగా ముగిసింది.

1987 వరల్డ్ సెమీ ఫైనల్

1987 వరల్డ్ సెమీ ఫైనల్

స్వదేశంలో జరిగిన ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ ఆశలను ఇంగ్లాండ్ జట్టు వమ్ము చేసింది. ఈ మ్యాచ్‌లో గవాస్కర్ సెంచరీ చేయగా, చేతన్ చౌహాన్ హ్యాట్రిక్ ఫీట్‌తో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్‌ను ఇంగ్లండ్ 35 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బరిలోకి దిగిన కపిల్‌దేవ్ నేతృత్వంలోని టీమిండియా 45.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.

1980 గోల్డెన్ జూబ్లీ టెస్టు

1980 గోల్డెన్ జూబ్లీ టెస్టు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వాంఖడేలో జరిగిన గోల్డెన్‌ జూబ్లీ టెస్టులో భారత్‌పై ఇంగ్లండ్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో242 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో 58పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుని బోథమ్(114) అద్భుత సెంచరీతో ఆదుకోవడంతో 296 పరుగుల స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బోథమ్ (7/48) విజృంభించడంతో భారత్ 149కే ఆలౌటైంది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వికెట్ కోల్పోకుండా విజయాన్ని సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X