న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో వార్నర్ సేన ఆ రికార్డుని చెరిపేస్తుందా?

ఐపీఎల్ పదో సీజన్‌లో ఢిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య శనివారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ జరుగనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో ఢిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య శనివారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ జరుగనుంది. ఈ సీజన్‌లో వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడింది.

దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించి కోల్ కతా మంచి జోరు మీదుంది. అదే జోరుని ఈ మ్యాచ్‌లో కొనసాగించాలని భావిస్తోంది. సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్, శిఖర్‌ ధావన్‌ రాణిస్తున్నా మిడిలార్డర్ పేలవంగా ఉంది.

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ప్రధానంగా ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైనే ఆధారపడుతోంది. ఇటీవల మ్యాచ్‌ల్లో వెటరన్ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ విఫలం చెందడం కూడా ఆ జట్టును కలవరపరుస్తోంది. యువీతో పాటు మిగతా బ్యాట్స్ మెన్ కూడా రాణిస్తే శనివారం నాటి మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుంది.

బెన్‌ కట్టింగ్‌పై వేటు

బెన్‌ కట్టింగ్‌పై వేటు

ఈరోజు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌ కట్టింగ్‌పై వేటు తప్పకపోవచ్చు. అతని స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే అప్ఘనిస్థాన్ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ సత్తా చాటుతున్నాడు. పేసర్లలో భువనేశ్వర్‌ కుమార్, ఆశిష్‌ నెహ్రా ఆకట్టుకుంటున్నారు.

ముఖాముఖి పోరులో కోల్‌కతాదే పైచేయి

ముఖాముఖి పోరులో కోల్‌కతాదే పైచేయి

ముఖాముఖి పోరులో కోల్‌కతా 6 విజయాలను సొంతం చేసుకుంటే హైదరాబాద్ మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ సీజన్‌లో తమ రికార్డుని మెరుగుపరచుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో తిరుగులేని రికార్డు కోల్‌కతా సొంతం. ఈ స్టేడియంలో హైదరాబాద్... కోల్ కతాపై ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు.

అనూహ్యంగా పుంజుకున్న కోల్‌కతా

అనూహ్యంగా పుంజుకున్న కోల్‌కతా

మరోవైపు ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన కోల్‌కతా... కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ పదో సీజన్‌లోనే ఉమేశ్ యాదవ్ సత్తా చాటాడు. ఆడిన తొలిమ్యాచ్‌లోనే నాలుగు వికెట్ల తీశాడు. క్రిస్‌ వోక్స్‌ ఆకట్టుకున్నాడు.

ఓపెనర్‌గా సునీల్ నరేన్

ఓపెనర్‌గా సునీల్ నరేన్

ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే కోల్‌కతా సునీల్‌ నరైన్‌‌ను ఓపెనర్‌గా పంపి విజయవంతమైంది. గతంలో ఓపెనింగ్‌ చేసిన అనుభవమున్న సునీల్ నరేన్ సానుకూల ఫలితం పొందింది. దీంతో గాయంతో జట్టుకు దూరమైన క్రిస్‌ లిన్‌ స్థానంలో నరైన్‌ మరికొన్ని మ్యాచ్‌లకు ప్రయత్నించవచ్చు. మరోవైపు కెప్టెన్‌ గౌతం గంభీర్‌ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

కోల్‌కతా నైట్ రైడర్స్: Gautam Gambhir (captain), Darren Bravo, Trent Boult, Piyush Chawla, Nathan Coulter Nile, Colin de Grandhomme, Rishi Dhawan, Sayan Ghosh, Shaikb Al Hasan, Sheldon Jackson, Ishank Jaggi, Kuldeep Yadav, Chris Woakes, Chris Lynn, Sunil Narine, Manish Pandey, Yusuf Pathan, Ankit Rajpoot, Suryakumar Yadav, Robin Uthappa (wicketkeeper) and Umesh Yadav.

సన్‌రైజర్స్ హైదరాబాద్: David Warner (captain), Shikhar Dhawan, Moises Henriques, Yuvraj Singh, Deepak Hooda, Ben Cutting, Naman Ojha (wicketkeeper), Bipul Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, Ashish Nehra, Tanmay Agarwal, Ricky Bhui, Eklavya Dwivedi, Chris Jordan, Kane Williamson, Siddharth Kaul, Ben Laughlin, Abhimanyu Mithun, Mohd Nabi, Mohd Siraj, Vijay Shankar, B Sran and Pravin Tambe.

మ్యాచ్ ఆరంభం 4 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

శనివారం రాత్రి 8 గంటలకు - Delhi Vs Punjab in Delhi

ఆదివారం (April 16) జరిగే మ్యాచ్‌లు

Mumbai Vs Gujarat in Mumbai - 4 PM

Bangalore Vs Pune in Bengaluru - 8 PM

కోల్‌కతా తదుపరి మ్యాచ్ - Vs Delhi on April 17 (Monday) in Delhi - 4 PM

హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Punjab on April 17 in Hyderabad - 8 PM

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X