న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలుపెవరిదో?: వేరే వేదికపై విజయం కోసం సన్‌రైజర్స్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఢిల్లీ మినహా అన్ని జట్లు తొలి ఏడు మ్యాచ్‌లు ఆడేశాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఢిల్లీ మినహా అన్ని జట్లు తొలి ఏడు మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ సొంత మైదానం ఉప్పల్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇక వేరే వేదికలపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఇక గత సీజన్‌లో రన్నరప్‌‌గా నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏడు మ్యాచుల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు కూడా మంగళవారం చిన్నసామి స్టేడియంలో తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ సీజన్‌లో బెంగళూరు ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్, జాదవ్, మన్‌దీప్‌లతో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉన్న బెంగళూరు 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసింది.

నెగ్గాలనే పట్టుదలతో

నెగ్గాలనే పట్టుదలతో

దీంతో హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. గత సీజన్‌ మాదిరిగా 16 పాయింట్లు సాధించి బెంగళూరు ఫ్లేఆఫ్‌ చేరాలంటే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ తప్పక నెగ్గాలి. అయితే హైదరాబాద్‌పై 6-4తో మెరుగైన రికార్డు ఉండటం బెంగళూరుని కలవర పెడుతోంది. ఈ రెండు జట్లు తలపడ్డ చివరి మూడు మ్యాచుల్లోను హైదరాబాద్‌దే విజయం.

3-2తో బెంగళూరుదే పైచేయి

3-2తో బెంగళూరుదే పైచేయి

అంతేకాదు చిన్నస్వామి స్టేడియంలో 3-2తో బెంగళూరుదే పైచేయి కావడం విశేషం. హైదరాబాద్ విషయానికి వస్తే కీలక సమయాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. హైదరాబాద్‌ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తూ విజయాలను దక్కించుకుంటున్నారు. ఇక బ్యాటింగ్‌లో జట్టు కెప్టెన్‌ వార్నర్‌ రాణిస్తున్నా మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి అంతగా సహకారం లభించడం లేదు.

టాపార్డర్‌పైనే ఆధారపడిన బెంగళూరు

టాపార్డర్‌పైనే ఆధారపడిన బెంగళూరు

ఈ సీజన్‌లో యువరాజ్‌సింగ్‌ పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోతున్నాడు. జట్టు కష్టా ల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు రాణిస్తుండటంతో వారు గెలుపు బాట పడుతున్నారు. ఇక బెంగళూరు విషయానికి వస్తే వరల్డ్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా ఆ జట్టు డీలా పడిపోతోంది. ముఖ్యంగా టాపార్డర్‌పైనే వారి బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Virat Kohli (captain), Tymal Mills, Aniket Chaudhary, Praveen Dubey, Billy Stanlake, AB de Villiers, Chris Gayle, Yuzvendra Chahal, Harshal Patel, Mandeep Singh, Adam Milne, Vishnu Vinod, Sreenath Arvind, Kedar Jadhav (wicketkeeper), Shane Watson, Stuart Binny, Samuel Badree, Iqbal Abdulla, Travis Head, Sachin Baby, Avesh Khan and Tabraiz Shamsi.

సన్ రైజర్స్ హైదరాబాద్: David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddarth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.

మ్యాచ్ ప్రారంభం రాత్రి 8 గంటలకు - Live on Sony SIX, Sony Max, Sony ESPN

బుధవారం (April 26) మ్యాచ్‌లు - Pune Vs Kolkata in Pune - 8 PM

బెంగళూరు తదుపరి మ్యాచ్ - Vs Gujarat on Aprill 27 (Thursday) in Bengaluru - 8 PM

హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Punjab on April 28 (Friday) in Mohali - 8 PM

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X