న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌పై విజృంభణ: ఐసిసి నెం.1 బౌలర్‌గా అశ్విన్

న్యూఢిల్లీ/అంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఏడు వికెట్లను తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. మంగళవారం(జులై 26) ఐసిసి విడుదల చేసిన బౌలర్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌లలో అశ్విన్ అగ్రస్థానం నిలిచాడు.

అశ్విన్ బంతికి విండీస్‌ విలవిల: 63ఏళ్లకు కోహ్లీ సేన రికార్డు గెలుపుఅశ్విన్ బంతికి విండీస్‌ విలవిల: 63ఏళ్లకు కోహ్లీ సేన రికార్డు గెలుపు

876 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, ఇంతకుముందు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 5వ స్థానానికి పడిపోయాడు.

R Ashwin becomes No. 1 Test bowler again after taking 7 wickets

అంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన అశ్విన్.. ఆసియా ఖండం వెలుపల భారత్ సాధించిన అతిపెద్ద విజయానికి బాటలు వేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడా(92)తో విండీస్‌ను చిత్తు చేయడం విశేషం.

'భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2015 తర్వాత మరోసారి అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత రాణించి 7వికెట్లు తీశాడు. దీంతో 92పరుగుల తేడాతో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది' అని ఐసిసి పేర్కొంది.

టీమ్ ఇండియా బంపర్ బోణీ : క్రెడిట్ కుంబ్లేదే అంటోన్న అశ్విన్టీమ్ ఇండియా బంపర్ బోణీ : క్రెడిట్ కుంబ్లేదే అంటోన్న అశ్విన్

'వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగులిచ్చిన అశ్విన్.. వికెట్లు తీశాడు. అంతేగాక, బ్యాటింగ్‌తో కూడా రాణించాడు. 113 పరుగులు చేసి ఇండియా భారీ స్కోరులో భాగస్వామి అయ్యాడు. బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ లో కూడా అతని స్థానం మెరుగుపడింది' అని తెలిపారు.

R Ashwin becomes No. 1 Test bowler again after taking 7 wickets

'ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన పాక్ బౌలర్ యాసిర్ షా.. రెండో టెస్టులో కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడు తన అగ్రస్థానాన్ని కోల్పోయి 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది' ఐసిసి పేర్కొంది.

ఐసిసి బౌలర్స్ టెస్ట్ ర్యాంకింగ్స్(జులై 26, 2016)

1. రవిచంద్రన్ అశ్విన్(భారత్) -876 పాయింట్లు

2. జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లాండ్) -875పాయింట్లు

3. స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లాండ్) -852పాయింట్లు

4. డేల్ స్టెయిన్(దక్షిణాఫ్రికా) -841పాయింట్లు

5. యాసిర్ షా(పాకిస్థాన్) -832పాయింట్లు

6. రవీంద్ర జడేజా(భారత్) -781పాయింట్లు

7. ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) -757పాయింట్లు

8. జోష్ హజ్లెవుడ్(ఆస్ట్రేలియా) -741పాయింట్లు

9. మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా) -724పాయింట్లు

10. వెర్నన్ ఫిలాండర్(దక్షిణాఫ్రికా) -717పాయింట్లు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X