న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీ టెస్టులో అరుదైన రికార్డు నెలకొల్పిన అశ్విన్

రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు.

By Nageshwara Rao

దరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 2016-17 సీజన్‌లో అశ్విన్ 78 వికెట్లు తీసుకున్నాడు.

2010 తర్వాతే ఆస్ట్రేలియానే: డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు2010 తర్వాతే ఆస్ట్రేలియానే: డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు

R Ashwin creates another record in ranchi test

అంతకముందు 2007-08 సీజన్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా 78 వికెట్లు తీశాడు. తాజాగా స్టెయిన్ రికార్డుని అశ్విన్ సమం చేశాడు. ఇదిలా ఉంటే రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన చేసింది.

విజయం ఖాయ‌మ‌నుకున్న టీమిండియా ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. చివరిరోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్, పీట‌ర్ హ్యాండ్స్‌ కోంబ్ అద్భుత ప్రదర్శన చేశారు. చివరిరోజు 62 ఓవ‌ర్ల పాటు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

63 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచులో ఉన్న ఆస్ట్రేలియాను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. వీరిద్దరి జోడీ ఐదో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండు సెష‌న్ల పాటు ఈ ఇద్ద‌రూ వికెట్ ఇవ్వ‌కుండా భార‌త బౌల‌ర్ల స‌హనాన్ని ప‌రీక్షించారు.

రాంచీ టెస్టు: కోహ్లీని ఎగతాళి చేసిన ఆసీస్ ఆటగాళ్లకు చురకలురాంచీ టెస్టు: కోహ్లీని ఎగతాళి చేసిన ఆసీస్ ఆటగాళ్లకు చురకలు

టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈ జోడీని విడదీసేందుకు తెగ కష్టపడ్డారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్ కోంబ్ 72 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌లో టెస్టుని డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే కావడం విశేషం. ఈ సిరీస్‌లో చివరి టెస్టు ఈ నెల 25న ధర్మశాలలో ప్రారంభం కానుంది.

రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు, అశ్విన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. డబుల్ సెంచరీ చేసిన పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

రాంచీ టెస్టు స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 451/10
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 603/9 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 204/6

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X