న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

125 పరుగులతో సత్తా చాటిన ద్రావిడ్ తనయుడు

By Srinivas

బెంగళూరు: భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ 125 పరుగులు చేసి రాణించాడు. బీయూసీసీ(ఏ) తరఫున సమిత్ ఆడుతున్నాడు. సమిత్ రెచ్చిపోయి ఆడడంతో బీయూసీసీ(ఏ) 246 పరుగుల తేడాతో అండర్ - 14 టైగర్ కప్‌ను గెలుచుకుంది.

సమిత్‌తో పాటు ప్రత్యూష్ (143 నాటౌట్)తో రాణించాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్‌కు 213 పరుగులు జోడించారు. ద్రావిడ్ తనయుడు సమిత్ వయస్సు పదేళ్లు. ప్రత్యూష్, సమిత్ రాణించారు. వీరి దూకుడుతో బీయూసీసీ(ఏ) 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.

Rahul Dravid's son Samit hits 125 as BUCC win by 246 runs in Tiger Cup

బుధవారం నాడు లయోలా మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫ్రాంక్ ఆంటోనీ పబ్లిక్ స్కూల్ (ఫ్యాప్స్) కేవలం 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బీయూసీసీ(ఏ) 246 పరుగులతో విజయం సాధించింది.

ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మెంటార్‌గా ఉన్నారు. గత ఏడాది ద్రావిడ్ మాట్లాడుతూ.. తన కొడుకులు సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్‌ బ్యాటింగ్‌ను కాపీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గత ఏడాది సమిత్ గోపాలన్ క్రికెట్ చాలెంచ్ టోర్నమెంటులో బెస్ట్ బ్యాట్సుమెన్ అవార్డు పొందాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X