న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓజా Vs దిండా: వాగ్వాదం, తోపులాట, కొట్టుకునే వరకు

By Nageshwara Rao

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాళ్లు, ప్రస్తుతం బెంగాల్ జట్టు తరుపున రంజీ మ్యాచ్‌లో ఆడుతున్న అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. తమిళనాడుతో జరిగే రంజీ గ్రూప్ లీగ్ మ్యాచ్ కోసం బెంగాల్ ఆటగాళ్లు తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సీనియర్ అధికారి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 'నిజానికి ఇందులో ఓజా తప్పేమీ లేదు. అతడు చాలా నెమ్మదస్తుడు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు దిండా చాలా గట్టిగా బంతిని కిక్ చేశాడు. అది నేరుగా ఓజా చెవుల పక్కనుంచే వెళ్లింది. కొద్దిలో ఓజా గాయపడేవాడు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఓజా... దిండాపై అరిచాడు. తను దగ్గరికి రావడంతో ఓజా వెనక్కి నెట్టేశాడు. దీంతో కిందపడిన దిండా తిరిగి ఓజా పైకి రాగా ఇతర ఆటగాళ్లు వారిద్దరినీ విడదీశారు' అని తెలిపారు.

ఇద్దరు ఆటగాళ్లు కీలకమే

ఇద్దరు ఆటగాళ్లు కీలకమే

ఇద్దరు ఆటగాళ్లు కూడా బెంగాల్ జట్టు తరుపున రంజీ మ్యాచ్‌ల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై బెంగాల్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి, కోచ్ సాయిరాజ్ బహుతులే, మేనేజర్ ఆటగాళ్లిద్దరితో మాట్లాడి మరోసారి ఇలాంటి చేష్టలకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు.

 ‘అవుట్ సైడర్' అని ఓజాను ఎగతాళి చేసిన దిండా

‘అవుట్ సైడర్' అని ఓజాను ఎగతాళి చేసిన దిండా

అని దిండా ఎగతాళి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఇలాంటివి మంచిది కాదని సూచించారు.

 గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవ

గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవ

గత ఐదు సీజన్లుగా దిండా రంజీల్లో బెంగాల్ జట్టు తరుపున ఫేస్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవకు దిగిన సంఘటనలున్నాయి. 2008లో రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆడుతున్న సమయంలో శిబ్ శంకర్ పాల్‌తో ఇదే విధంగా వ్యవహారించాడు.

విజయ్ హాజరే ట్రోఫీలో రనదీప్ బోస్‌ Vs దిండా

విజయ్ హాజరే ట్రోఫీలో రనదీప్ బోస్‌ Vs దిండా

ఇక 2009లో అగర్తలలో జరిగిన విజయ్ హాజరే ట్రోఫీలో సీనియర్ మోస్ట్ బౌలర్ రనదీప్ బోస్‌, దిండా ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. అయితే అప్పటి కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లాతో పాటు వైస్ కెప్టెన్ మనోజ్ తివారి కలగజేసుకుని సర్ది చెప్పడంతో ఆ గొడవ అప్పట్లో సర్దుమణిగింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X