న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పైన రవిశాస్త్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయంతో తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని చెప్పాడు. ఈ పదవి దక్కుతుందని రవిశాస్త్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
హెడ్‌కోచ్‌గా కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా శాస్త్రి: కోహ్లీ చక్రం!
కానీ అనిల్ కుంబ్లేను కమిటీ ఎంపిక చేసింది. దీనిపై రవిశాస్త్రి స్పందించాడు. డైరెక్టర్‌గా పద్దెనిమిది నెలల పాటు పని చేసి మెరుగైన ఫలితాలను రాబటట్గలిగానని చెప్పాడు. అంతేకాకుండా జట్టును నిశితంగా పరిశీలించానని, కోచ్‌గా తనను నియమించినట్లయితే ఆ అనుభవం ఉపయోగపడేదన్నాడు. ప్రధాన కోచ్‌గా నియమితుడైన అనిల్ కుంబ్లేకు అంతా మంచే జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.
మేం అనుకోలేదు: కుంబ్లేపై బీసీసీఐ చీఫ్ షాకింగ్ ట్విస్ట్
రవిశాస్త్రి అత్యుత్సాహం!
రవిశాస్త్రి ప్రధాన కోచ్ పదవి పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. కోచ్ ఎంపిక ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసిన మొదట్లోనే అతను దరఖాస్తు చేసుకున్నాడు. తాను ప్రధాన కోచ్‌గా నియామకమైతే సహాయక కోచ్‌లుగా ఎవరెవరు ఉండాలో కూడా రవిశాస్త్రి ఆత్మవిశ్వాసం లేదా అత్యుత్సాహంతో ముందుగానే ప్రకటించాడు.