న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నట్టున్నావ్.. హద్దులో ఉంటే మంచిది : రవిశాస్త్రి కామెంట్స్ పై గంగూలీ

కోల్ కతా : కోచ్ పదవికి ఇంటర్వ్యూలు ఏమో గానీ మొత్తానికి వ్యవహారం మాత్రం మాజీ కెప్టెన్లు గంగూలీ-రవిశాస్త్రిల మధ్య అగాథాన్నే సృష్టిస్తోంది. తొలుత రవిశాస్త్రి గంగూలీని టార్గెట్ చేసుకుని వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే.. అందుకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో గంగూలీ కూడా రవికి గట్టి వార్నింగే ఇచ్చాడు.

టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో తనను గంగూలీ ఇంటర్వ్యూ చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ టీమ్ ఇండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ గంగూలీ.

రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన గంగూలీ.. రవిశాస్త్రి వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి, బాధకు గురిచేశాయని చెప్పాడు. రవిశాస్త్రి ఇంటర్య్యూకి హాజరైన సమయంలో అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా తాను అక్కడ లేకపోవడంపై వివరణ ఇస్తూ.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అదే రోజు బెంగాల్ క్రికెట్ సంఘం సమావేశం ఉండడంతో బీసీసీఐ అనుమతి తీసుకునే తాను ఆ సమావేశం కోసం వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు గంగూలీ.

 Ravi Shastri is living in a fool’s world, says Sourav Ganguly

సమావేశం ఉండడం వల్లే వెళ్లాల్సి వచ్చింది తప్ప బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో చేసింది కాదని గంగూలీ వివరణ ఇచ్చుకున్నాడు. ఇకపోతే తనను టార్గెట్ చేసుకుని అనవసర కామెంట్స్ చేస్తోన్న రవిశాస్త్రి కోచ్ పదవి కావాలనుకునే వ్యక్తే అయితే హాలిడే టూర్ పేరిట విదేశాల్లో ఎందుకు గడిపాడని నిలదీశాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. కేవలం నేను ఇంటర్వ్యూ చేయకపోవడం వల్లే రవిశాస్త్రికి కోచ్ పదవి దక్కలేదని భావిస్తే, రవి పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నట్టే అని ఎద్దేవా చేశారు. తమ మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పిన గంగూలీ, ఒకరిని విమర్శించే ముందు అన్ని విధాలుగా ఆలోచించుకున్నాకే కామెంట్స్ చేయాలని సూచించాడు.

కాగా, ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ అక్కడ లేకపోవడంతో.. గంగూలీకి తనతో వచ్చిన సమస్యేంటో అని ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా రవిశాస్త్రి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X