న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

500వ టెస్ట్: 3 వికెట్లు తీస్తే అశ్విన్ కెరీర్‌లో మరో మైలురాయి

By Nageshwara Rao

కాన్పూర్: క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న టీమిండియా ఆఫ్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా ఉన్న అశ్విన్ కాన్పూర్‌లో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లను సాధిస్తే 200 వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల సరసన చేరనున్నాడు.

అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు. 36 టెస్టుల్లో క్లారీ గ్రెమెట్ ఈ ఘనతను సాధించాడు.

అంతక ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మిట్ పేరిట ఉంది. 36 టెస్టుల్లో క్లారీ ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

Ravichandran Ashwin in the hunt for being the 2nd fastest to 200 Test wickets

కాగా, పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీలు 38 టెస్టుల్లో 200 వికెట్లు తీసుకుని రెండో స్థానంలో ఉన్నారు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు అశ్విన్‌కు 37వ టెస్టు మ్యాచ్ కావడంతో వారిద్దరి రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది.

500వ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ మూడు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటీవల ముగిసిన వెస్టిండిస్ టెస్టు సిరిస్‌లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో అశ్విన్ మెరిసిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక సిరిస్‌లో రెండు సార్లు ఐదు వికెట్లుకుపైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గతంలో ఈ ఘనతను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.

1979-80లో పాకిస్తాన్‌పై, 1981-82లో ఇంగ్లాండ్‌పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు. వెస్టిండిస్ సిరిస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని అందుకున్నాడు.

ఇలా ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అందుకున్న మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, హార్భజన్ సింగ్, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్, సౌరభ్ గంగూలీల సరసన నిలిచాడు. 36 టెస్టు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X