న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న స్టార్ క్రికెటర్: అయినా కోహ్లీకి ఫ్యాన్ అయ్యాడు (వీడియో)

బుడి బుడి అడుగులు వేసుకుంటూ పెద్ద టీషర్టు ధరించి బుల్లి బ్యాటు పట్టుకుని బంతిని నెట్స్‌లోకి కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న తీరును పరిశీలిస్తూ అతనిలా బ్యాటింగ్‌ చేయడానికి ప

By Nageshwara Rao

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఐపీఎల్‌లో భాగంగా తమ తదుపరి మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు కోల్‌కతాకు చేరుకుంది. ఏప్రిల్ 23 (ఆదివారం) ఇరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

దీంతో బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో బుడి బుడి అడుగులు వేసుకుంటూ పెద్ద టీషర్టు ధరించి బుల్లి బ్యాటు పట్టుకుని బంతిని నెట్స్‌లోకి కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న తీరును పరిశీలిస్తూ అతనిలా బ్యాటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు.

RCB AB De Villiers son Abraham playing and enjoying on ground IPL 10

ఇంతకీ ఆ బుడతడు ఎవరంటే? బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ కుమారుడు అబ్రహాం. బుల్లి ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని బంతిని కొడుతూ, ఏబీ బసచేసిన హోటల్లో మొత్తం అటూ ఇటూ పరుగులు పెడుతూ సందడి చేస్తున్న అబ్రహం వీడియో యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది.

RCB AB De Villiers son Abraham playing and enjoying on ground IPL 10

ఇద్దరూ కలిసి క్రికెట్‌ ఆడుతూ మైదానంలో సందడిగా గడిపారు. 'గో ఆర్సీబీ' అని వచ్చీరాని మాటలతో చెబుతూ తన తండ్రిని మురిపిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివీలియర్స్ తన కొడుకు వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.

ఇప్పటికే దానికి పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్ పదో సీజన్‌లో డివీలియర్స్ ఆర్‌సీబీ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడి 68.50 సగటుతో 137 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 141.23 ఉంది. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఆ తర్వాత ఈ సీజన్‌లో ఏబీ ఆడిన తొలి మ్యాచ్‌ 49 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X