న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనికి ఇంత అవమానమా?: పుణె ఫ్రాంచైజీపై అజారుద్దీన్ ధ్వజం

ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనిని తప్పించిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇది చెత్త నిర్ణయమని, ధోనిని అవమాంచడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారత క్రికెట్లో ధోనీ ఆణిముత్యం

భారత క్రికెట్లో ధోనీ ఆణిముత్యం

‘కెప్టెన్సీ మార్పు.. నిర్ణయం తీసుకున్న తీరు, దానిని అమలుపరుచిన విధానం చెత్తగా, తలవంపులు తెచ్చేవిధంగా ఉంది. భారత క్రికెట్లో ధోనీ ఆణిముత్యం. తన 8-9 ఏళ్ళ కెప్టెన్సీ కెరీర్‌లో ధోనీ దాదాపు అన్నింటిని సాధించాడు.

మా సొంత డబ్బుతో జట్టును నడిపిస్తున్నామని, కాబట్టి మాకు నచ్చిన నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీ అనుకొని ఉండొచ్చు' అని అన్నాడు.

ధోనీ విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది

ధోనీ విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది

'కానీ కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికేటప్పుడు ధోనీ స్థాయి అతని ప్రతిష్టను, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. అతనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? జట్టు బాగా ఆడకపోతే కెప్టెన్‌ ఏం చేస్తాడు? ధోనీ మంచి ఆటగాడు కాకుంటే.. స్ఫూర్తి నింపలేని నాయకుడే అయ్యుంటే ఐపీఎల్‌లో చెన్నైని రెండుసార్లు ఎలా గెలిపించేవాడా?' అని ఆజ్ తక్ ఛానెల్‌కి ఇంటర్యూలో అజారుద్దీన్ మండిపడ్డాడు.

నాయకత్వ మార్పుపై ధోనితో చర్చించాలి

నాయకత్వ మార్పుపై ధోనితో చర్చించాలి

'ఒకవేళ నాయకత్వ మార్పు చేయాలనుకుంటే ఆ విషయాన్ని ముందు ధోనీతో చర్చించాలి. తనంత తానుగా తప్పుకునే వెసులుబాటు కల్పించాలి. అనంతరం అది ధోనీ సొంత నిర్ణయమని ప్రపంచానికి చెప్పొచ్చు. గౌరవప్రదంగా అతనిని తప్పించి ఉంటే బాగుండేది. వ్యాపారవేత్తలా ఆలోచించేవాడు క్రీడాకారుడి గురించి పట్టించుకోడు. ఈ వ్యవహారాన్ని బీసీసీఐ వదిలిపెట్టొద్దు'' అని పేర్కొన్నాడు.

ధోని స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

ధోని స్థానంలో కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

బెంగుళూరులో ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలానికి ముందు రోజైన ఆదివారం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనిని తొలగిస్తున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. ధోని స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X