న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతడి కెప్టెన్సీ పోవడానికి కారణం నేను కాదు'

By Nageshwara Rao

హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు సమావేశాల్లో రాస్ టేలర్ ఎప్పుడూ తన ఆలోచనలను ఇతరులతో పంచుకునే వాడు కాదని, మౌనంగా ఉండేవాడని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెక్‌కల్లమ్ రాసిన 'డిక్లేర్' అనే పుస్తకంలో టేలర్‌కు, తనకు మధ్య సంభవించిన కొన్ని సంఘటనలతో ఓ చాఫ్టర్‌నే రాశాడు. అందులో గతంలో న్యూజిలాండ్ జట్టుకు రాస్ టేలర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎప్పుడూ పెదవి విప్పేవాడే కాదని రాసుకొచ్చాడు.

Ross Taylor didn't communicate as New Zealand captain: BrendonMcCullum

రాస్ టేలర్ కెప్టెన్సీలో ఆడేటప్పుడు తాను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా అందులో పొందుపరిచాడు. 'మా ప్రధాన కోచ్ మైక్ హెస్సెన్ ఎప్పుడూ ఆటగాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకునేవాడు. అయితే ఇందుకు కారణంగా కెప్టెన్‌గా రాస్ టేలర్ ఎప్పుడూ జట్టు ప్రణాళికలు చెప్పకపోవడమే. అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

కోహ్లీ క్యాచ్ మిస్: భారత విజయంలో రాస్ టేలర్ పాత్ర

'భవిష్యత్తు ప్రణాళికలేమిటో మేమే చెప్పేవాళ్లం. రాస్‌ను ఎప్పుడు అడిగినా ఏమీ లేదు అనేవాడు. ఒక్క పదం కూడా మాట్లాడేవాడు కాదు. దాంతో మా కోచ్ అయోమయంలో పడేవాడు. ఇలా రాస్ ఎందుకు చేసేవాడు నాకైతే తెలీదు. జట్టును ఎప్పుడూ సరైన రీతిలో పెట్టలేకపోయేవాడు. అతని ఆలోచల్ని కూడా జట్టు సభ్యులతో పంచుకునేవాడు కాదు' అని మెక్‌కల్లమ్ వెల్లడించాడు.

Ross Taylor didn't communicate as New Zealand captain: BrendonMcCullum

రాస్ టేలర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు డిసెంబర్, 2012లో శ్రీలంకపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌కు టేలర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను డానియేల్ వెటోరికి అప్పగించారు.

క్యాచ్ మిస్, సెంచరీ: టేలర్‌కు కోహ్లీ ఓదార్పు, గతంలో నాకు అలా

అయితే రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి తాను ఎంతమాత్రం కాదని మెక్ కల్లమ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే టేలర్‌ను తప్పించి అతని స్ధానంలో డానియల్ వెటోరికీ న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పడాన్ని మాత్రం మెకల్లమ్ పరోక్షంగా విమర్శించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X