న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ: వీరాభిమాని వీసా కోసం సచిన్ లేఖ

టీమిండియా ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ ఆడినా గ్యాలరీలో త్రివర్ణ పతాకంతో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సులు బాదినప్పుడు అభివాదం చేస్తూ ఓ అభిమాని కనిపిస్తూ ఉంటాడు. అతడే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని స

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ ఆడినా గ్యాలరీలో త్రివర్ణ పతాకంతో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సులు బాదినప్పుడు అభివాదం చేస్తూ ఓ అభిమాని కనిపిస్తూ ఉంటాడు. అతడే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్.

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ వీడ్కోలు పలికిన తర్వాత కూడా సుధీర్ కుమార్ టీమిండియా ఆడే మ్యాచ్‌ల్లో క్రికెటర్లతో పాటు అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళ్లింది.

 Sachin Tendulkar helps fan Sudhir Kumar get quick visa to cheer for India at ICC Champions Trophy


ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సుధీర్ కుమార్ తన త్రివర్ణ పతాకంతో కనిపించలేదు. ఇందుకు కారణం ఎంటంటే టీమిండియాతో కలిసి సుధీర్‌ ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా అతడికి బ్రిటిష్ హైకమిషన్ వీసా ఇవ్వలేదు.

దీంతో తన వీరాభిమాని సుధీర్‌కు వీసా లభించకపోవడంపై సచిన్‌ టెండూల్కర్ స్పందించాడు. సుధీర్‌కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. 'భారత జట్టుకు సుధీర్‌ వెలకట్టలేని మద్దతుదారుడని, అతను ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారు' అని ఆశిస్తున్నట్లు సచిన్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X