న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఒక్కడు సచిన్: బ్రాడ్ all-time XI జట్టు ఇదే

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకి కెప్టెన్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ని ఎంపిక చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకి కెప్టెన్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ని ఎంపిక చేశాడు. తన జట్టులో టీమిండియా తరుపు నుంచి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఒక్కడికే చోటు దక్కింది.

ఇంగ్లాండ్ జట్టు నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ ఎంపిక చేసిన జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు చోటు దక్కించుకన్నారు.

మరోవైపు వెస్టిండిస్ నుంచి బ్రియాన్ లారా, న్యూజిలాండ్ నుంచి రిచర్డ్ హ్యాడ్లీ, భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్‌లు ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి అలెస్టర్ కుక్, మ్యాథ్యూ ప్రియర్, జేమ్స్ ఆండర్సన్‌లు జాబితాలో ఉన్నారు.

Sachin Tendulkar only Indian player in Stuart Broad's all-time XI

బ్రాడ్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో పాకిస్థాన్, శ్రీలంక జట్టుకు చెందిన ఏ ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. తన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌ని ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా హెడెన్, అలెస్టర్ కుక్ పేర్లను సూచించాడు.

మాజీ దిగ్గజ క్రికెటర్లు అయిన రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలను మిడిల్ ఆర్డర్‌కు సూచించాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ లెజెండరీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్‌కు బదులు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ మ్యాథ్యూ ప్రియర్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యంగా ఉంది.

స్టువర్ట్ బ్రాడ్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు:
1. అలెస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్)
2. మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా)
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
4. సచిన్ టెండూల్కర్ (భారతదేశం)
5. బ్రియాన్ లారా (వెస్టిండీస్)
6. జాక్వెస్ కలిస్ (సౌత్ ఆఫ్రికా)
7. మాథ్యూ ప్రియర్ (ఇంగ్లాండ్ - వికెట్ కీపర్)
8. సర్ రిచర్డ్ హాడ్లీ (న్యూ జేఅలాండ్)
9. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా - వైస్ కెప్టెన్)
10. గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
11. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X