న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ప్రత్యేకం: ఎందుకంటే చెప్పిన జయసూర్య

విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆటగాడని, క్రికెట్ పట్ల అతడికున్న దృక్పథం, ఆట కోసం అతను పడే కష్టం ఇతర క్రికెటర్ల కంటే భిన్నంగా ఉంటుందని మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో జయసూర్య తెలిపాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మైదానంలో దూకుడుగా ప్రవర్తించే కోహ్లీ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య చేరాడు.

విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆటగాడని, క్రికెట్ పట్ల అతడికున్న దృక్పథం, ఆట కోసం అతను పడే కష్టం ఇతర క్రికెటర్ల కంటే భిన్నంగా ఉంటుందని మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో జయసూర్య తెలిపాడు. మ్యాచ్‌కి ముందు బాగా హార్డ్ వర్క్ చేస్తే అత్యుత్తమ ప్రదర్శన చేయొచ్చని అన్నాడు.

అంతేకాదు కోహ్లీ ఫ్రొఫెషనల్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. కాగా, 2016లో కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 405 పరుగులు సాధించాడు.

ఈ టెస్టు సిరిస్‌లో చెలరేగి ఆడుతున్న కోహ్లీ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్దానానికి ఎగబాకాడు. పరుగుల మెషిన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లీ 68.92 యావరేజితో 965 పరుగులు చేశాడు.

ఫిట్‌నెస్ పరంగా కూడా కోహ్లీ రాటుదేలాడు. ఈ ఏడాది టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో క్రికెటర్ ఎలా ఉండాలనే దానిపై పలువురు మాజీలు కోహ్లీని ఆదర్శంగా చూపిస్తున్నారు. 'ఎ టాల్ ఆర్డర్' అనే పుస్తక ఆవిష్కరణ ప్రమోషన్ కోసం సనత్ జయసూర్య ఇండియాకు వచ్చారు.

ఈ సందర్భంగా జయసూర్య, కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. శ్రీలంక తరుపున 110 టెస్టు లాడిన జయసూర్య 6973 పరుగులు చేయగా, 445 వన్డేల్లో 13,430 పరుగులు సాధించాడు. పుస్తక ఆవిష్కరణ ఫోటోలు మీకోసం...

సనత్ జయసూర్య

సనత్ జయసూర్య

'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ ప్రమోషన్‌లో భాగంగా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య భారత్‌కు వచ్చారు.

మాట్లాడుతున్న జయసూర్య

మాట్లాడుతున్న జయసూర్య

'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ ప్రమోషన్‌లో మాట్లాడుతున్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య భారత్‌కు వచ్చారు.

 లంక తరుపున 110 టెస్టులు

లంక తరుపున 110 టెస్టులు

శ్రీలంక తరుపున 110 టెస్టు లాడిన జయసూర్య 6973 పరుగులు చేయగా, 445 వన్డేల్లో 13,430 పరుగులు సాధించాడు.

కపిల్ పతారే

కపిల్ పతారే

ప్రముఖ రచయిత కపిల్ పతారే రచించిన 'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య.

ప్రముఖులతో ఫోటోలకు ఫోజోలు

ప్రముఖులతో ఫోటోలకు ఫోజోలు

ప్రముఖ రచయిత కపిల్ పతారే రచించిన 'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ప్రముఖులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X