న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20లో అద్భుతం: ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 6 వికెట్లు తీశాడు

టీ20 క్రికెట్లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 6 వికెట్లు పడగొట్టి లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సర్ఫరాజ్‌ అష్రఫ్‌ సంచలనం సృష్టించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీ20 క్రికెట్లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా 6 వికెట్లు పడగొట్టి లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సర్ఫరాజ్‌ అష్రఫ్‌ సంచలనం సృష్టించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టీ20 టోర్నమెంట్‌లో అతను ఈ ఘనత సాధించాడు.

వివరాల్లోకి వెళితే ఇటీవల బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్‌లో యంగ్‌ పయనీర్ క్రికెట్‌ క్లబ్‌ తరఫున ఆడిన సర్ఫరాజ్‌ తన ప్రత్యర్ధి జట్టు మెర్కారా యూత్‌ క్రికెట్‌ క్లబ్‌ బ్యాట్స్‌‌మెన్‌‌కు చుక్కలు చూపించాడు. సర్ఫరాజ్ దెబ్బకు మెర్కారా క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్కూ కట్టారు.

ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ వరుస బంతుల్లో నలుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌ కూడా ఉంది. నిజానికి డబుల్ హ్యాట్రిక్ సాధించే అవకాశం కూడా అతనికి వచ్చింది. ఆరో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నిరాకరించాడు.

డబుల్ హ్యాట్రిక్‌ మిస్సయ్యాడు

డబుల్ హ్యాట్రిక్‌ మిస్సయ్యాడు

దీంతో డబుల్ హ్యాట్రిక్‌ను మిస్సయ్యాడు. లేదంటే మరో రికార్డుని సర్ఫరాజ్ సొంతం చేసుకుని ఉండేవాడు. దీంతో అతని జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మాట్లాడాడు. 'పరుగులను కట్టడి చేయాలంటే దూకుడుగా బౌలింగ్‌ చేయాలని నేను భావిస్తా. అదే నాకు వికెట్లు సంపాదించి పెడుతుంది. శ్రీలంక బౌలర్‌ మలింగ తరహాలో విభిన్న యాక‌్షన్‌‌తో బౌలింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌‌ను తికమకపెడతాను' అని అన్నాడు. సర్ఫరాజ్ బీహార్ రాష్ట్రం ముజఫరాబాద్‌కు చెందిన వాడు.

ఎయిర్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం

ఎయిర్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం

సయ్యెద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఒడిశాతో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌ తరఫున చివరిసారిగా ఆడిన సర్ఫరాజ్‌ ఇప్పటివరకు భారత ఏ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. తన తాజా ప్రదర్శనతో సెలెక్టర్లు తనను గుర్తిస్తారని ఈసారి భారత్ ఏ జట్టుతో పాటు, ఐపీఎల్‌లో కూడా సత్తా చాటుతాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

SEVEN-BALL ROMP:

SEVEN-BALL ROMP:

మొదటి బంతి: Catch at first slip

రెండో బంతి: LBW

మూడో బంతి: Dot

నాలుగో బంతి: LBW

ఐదో బంతి: bowled

ఆరో బంతి: LBW

ఏడో బంతి (first of second over): LBW

సంక్షిప్తంగా స్కోర్లు:

సంక్షిప్తంగా స్కోర్లు:

Young Pioneer CC: 264 for 4 in 20 overs (Sarfaraz Ashraf 40, Deepak 74, Kiran HB 70, Ram 22 n.o, Sunil 33 n.o, N Swamy 2/56) bt Mercara

Youth CC: 57 in 14.3 overs (Mahesh 22; Madan 3/21, Sarfaraz Ashraf 6/0 - 3-3-0-6)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X