న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాట నిలబెట్టుకున్నాడు: బంగ్లా క్రికెటర్‌కు అశ్విన్ 'స్పిన్' పాఠాలు

తాను చెప్పినట్టే ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన అనంతరం అశ్విన్ వద్ద స్ఫిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఉప్పల్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 208 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: తాను అన్న మాటను బంగ్లా క్రికెటర్ మెహిదీ హాసన్ నిలబెట్టుకున్నాడు. ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన క్రమంలో టీమిండియా టాప్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వద్ద స్ఫిన్ బౌలింగ్‌లో మెళకువలు నేర్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.

తాను చెప్పినట్టే ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన అనంతరం అశ్విన్ వద్ద స్ఫిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఉప్పల్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 208 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

టెస్టు మ్యాచ్ అనంతరం పలువురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను కలిశారు. స్పిన్‌ బౌలింగ్‌లో కొన్ని మెలకువలను బంగ్లా యువ స్పిన్నర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌కు అశ్విన్‌ నేర్పించాడు. తన అనుభవంతో బంతిని ఏవిధంగా వేయాలో వివిధ కోణాల్లో చూపిస్తూ వివరించాడు.

See pic: R Ashwin gives bowling tips to young Mehedi Hasan Miraz

ప్రస్తుతం టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ చెప్తున్న విషయాలను శ్రద్ధగా వింటున్న మిరాజ్‌ ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అశ్విన్‌ నుంచి స్పిన్‌ పాఠాలు తెలుసుకోవడానికి యువ క్రికెటర్‌ ఎంతో ఆసక్తి కనబర్చాడు.

ఇదిలా ఉంటే ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్ల మైలురాయిని అశ్విన్‌ అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు యువ క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ కోహ్లీని కలిశారు. కోహ్లీ వద్దకు వెళ్లి ఫొటోలు దిగి, ఆటో గ్రాఫ్‌లు తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X