న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మావాడి వంట అద్భుతం: కుమారుడి బ్రేక్‌ఫాస్ట్‌పై సచిన్‌

By Nageshwara Rao

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కుటుంబంతో సరాదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ ఎంత రుచిగో ఉందో అంటూ సచిన్ పొంగిపోయాడు.

తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ను తినబోతున్న ఫొటోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్‌ పోస్ట్‌ చేశాడు. 'మా అబ్బాయి తయారుచేసిన బ్రేక్‌ఫాస్ట్‌ ఇదీ! ఎప్పటికైనా ఇదే బెస్ట్‌' అంటూ ఓ క్యాప్షన్ పెట్టి అభిమానులతో పంచుకున్నాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తన దైనందిన విశేషాలను ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సచిన్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్జున్‌ తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ ప్లేట్‌తో ఉన్న ఓ సెల్ఫీని సచిన్ పోస్ట్‌ చేశాడు.

Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!!

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

ఇటీవలే సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్' ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా భారత్‌లో 2400 స్క్రీన్లపై విడుదల కాగా, ఓవర్‌సీస్‌లో 400 స్క్రీన్లపై విడుదలై బ్రహ్మాండగా ఆడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సచిన్ జీవితంలోని కొన్ని మరుపురాని ఘట్టాలను ప్రదర్శించారు.

ఇక సచిన్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. వన్డేల్లో 18,111 పరుగులు చేయగా, టెస్టుల్లో 14,692 పరుగులు చేశాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X