న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాహిద్‌ అఫ్రిది

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 21 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్లు అఫ్రిది ఆదివారం ప్రకటించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 21 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్లు అఫ్రిది ఆదివారం ప్రకటించాడు. టెస్టులు, వన్డేలకు గతంలోనే తప్పుకున్న అఫ్రిది తాజాగా టీ20 నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది.

1996లో కెన్యాపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పాకిస్థాన్ తరుపున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 1,176 పరుగులతో పాటు, 48 వికెట్లు సాధించాడు. ఇక వన్డేల్లో 398 మ్యాచ్‌ల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు.

Shahid Afridi retires from international cricket after 21-year career

ఇక టీ20 పార్మాట్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 1,405 పరుగులు, 97 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే సెంచరీ సాధించి అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.(అనంతరం 2014లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అండర్సన్‌(36 బంతుల్లో), 2015లో ఏబీ డివిలియర్స్‌(31 బంతుల్లో) ఆ రికార్డును చెరిపేశారు).

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X