న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహార్ రాజీనామా

By Nageswara Rao

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడి పదవికి శశాంక్ మనోహార్ రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నాం మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆయన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు.

ఐసీసీ చైర్మన్‌గా తిరిగి మళ్లీ పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో జరగనున్న ఐసీసీ ఎన్నికలకు ముందే బీసీసీఐ బోర్డు పదవికి రాజీనామా చేయాలని భావించే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జగ్మోహన్ దాల్మియా మరణాంతరం అక్టోబర్ 2015లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Shashank Manohar quits as BCCI president

మే నెలలో ఐసీసీ ఛైర్మన్ పదవికి జరిగే ఎన్నికల్లో మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగుతారు కాబట్టి పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు.

ఎందుకు తప్పుకున్నారు?

నిజానికి బీసీసీఐ అధ్యక్ష పదవి గౌరవప్రదమైనది. బోర్డు ఆదాయం, ప్రజల్లో క్రికెట్‌కు ఉన్న ఆసక్తి దృష్ట్యా బీసీసీఐ బాస్‌గా ఉండేందుకు రాజకీయ నాయకుల నుంచి.. వ్యాపారవేత్తల వరకూ క్యూ కడతారు. క్రికెట్‌లో చోటు చేసుకున్న స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో విషయంలో సుప్రీంకోర్టు ఎంతో సీరియస్‌గా ఉంది. దీనికి తోడు బీసీసీఐ సమూల ప్రక్షాళనకు సుప్రీంకోర్టు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీసీఐ పదవిలో ఉండి చేసేదేమీ లేదని గ్రహించినట్టున్న మనోహర్‌.. వైదొలిగేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కారణం ఇదీ?

బీసీసీఐ అధ్యక్షుడిగా మరో రెండేండ్ల పదవి కాలం మనోహర్‌కు ఉంది. కానీ లోధా సిఫార్సులు అమల్లోకి వస్తే.. మరోసారి వరసగా పదవి చేపట్టే వీలు లేదు. ఇక ఐసీసీ ఛైర్మన్‌ పదవికి మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే 2021 వరకూ శశాంక్‌ పదవిలో కొనసాగే వీలుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X