మార్ష్ నుంచి కోహ్లీ వరకు: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విన్నర్లు వీరే

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ తొమ్మిది సీజన్లలో ఆరుగురు ఛాంపియన్లను మనం చూశాం. ఆరంభ సీజన్ 2008లో రాజస్ధాన్ రాయల్స్ టైటిల్ విజేతగా నిలిస్తే, ఆ తర్వాతి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్‌ను గెలుచుకుంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ రెండేసి సార్లు టైటిల్‌ను గెలవగా, గత సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 అంటేనే ఎంటర్టెన్మెంట్. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌దే పైచేయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సులతో అలరిస్తున్నారు.

తొమ్మిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంతో మంది అద్బుతమైన బ్యాట్స్ మెన్లను మనం చూశాం. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్‌ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి సీజన్‌లో 616 పరుగులు చేసి తొలి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా షాన్ మార్ష్ నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ అత్యధికంగా రెండు సార్లు(2011, 2012) ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. భారత్ తరుపున ఆరెంజ్ క్యాప్ అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఐపీఎల్ 2010 సీజన్‌లో సచిన్ ఈ ఘనత సాధించాడు.

సచిన్ తర్వాత 2014లో రాబిన్ ఊతప్ప, 2016లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్నారు. ఇక ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్న ఆటగాళ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ 973 పరుగులతో మొదటి స్ధానంలో ఉన్నాడు.

2008 నుంచి 2016 వరకు ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్న ఆటగాళ్లు:

విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2016)

గత సీజన్‌లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్, 2015)

2015 సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన వార్నర్ 562 పరుగులు చేశాడు. ఐపీఎల్ డేవిడ్ వార్నర్ స్ట్రయిక్ రేట్ 156 కాగా, యావరేజి 43గా ఉంది.

రాబిన్ ఊతప్ప (కోల్ కతా నైట్ రైడర్స్, 2014)

2014 సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్ లాడిన రాబిన్ ఊతప్ప 660 పరుగులు చేశాడు. 2014లో కోల్‌కతా టైటిల్ గెలవడంలో రాబిన్ ఊతప్ప కీలకపాత్ర పోషించాడు.

మైక్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్, 2013)

మిస్టర్ క్రికెట్‌గా పేరుగాంచిన మైక్ హస్సీ 2013 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్ లాడిన హస్సీ 733 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది.

క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2012)

'యూనివర్స్ బాస్'గా పేరుగాంచిన క్రిస్ గేల్ రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 15 మ్యాచ్ లాడిన క్రిస్ గేల్ 733 పరుగులు చేశాడు.

క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2011)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ మొట్టమొదటి సారి 2011లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో క్రిస్ గేల్ 608 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గేల్ చెలరేగి ఆడాడు.

సచిన్ టెండూల్కర్ (మంబై ఇండియన్స్, 2010)

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 2010లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతనిథ్యం వహించిన సచిన్ ఈ సీజన్‌లో 15 మ్యాచ్ లాడి 618 పరుగులు చేశాడు.

మ్యాథ్యూ హెడెన్ (చెన్నై సూపర్ కింగ్స్, 2009)

ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ మ్యాథ్యూ హెడెన్ 2009లో ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2009 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున మ్యాథ్యూ హెడెన్ ప్రాతనిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్ లాడిన మ్యాథ్యూ హెడెన్ 572 పరుగులు చేశాడు.

షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2008)

ఐపీఎల్ 2008 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో షాన్ మార్ష్ 11 మ్యాచ్ లాడి 616 పరుగులు చేశాడు. తొలి సీజన్‌లో పంజాబ్ సెమీస్ వరకు వెళ్లింది.

Read in English: Orange Cap winners in IPL
English summary
Starting its journey in 2008, the Indian Premier League (IPL) has entered the 10th season this year. We already have 6 different champions in the last 9 years.
Please Wait while comments are loading...