న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ వన్డే సందర్భంగా ఈడెన్ గార్డెన్స్ స్టాండ్‌కు గంగూలీ పేరు

క్రికెట్‌కు విశేష సేవలందించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి పలువురి ప్రముఖుల పేర్లను ఈడెన్ గార్డెన్స్ స్టాండ్స్‌కు ఆదివారం (జనవరి 22)నాడు పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) .

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌కు విశేష సేవలందించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి పలువురి ప్రముఖుల పేర్లను ఈడెన్ గార్డెన్స్ స్టాండ్స్‌కు ఆదివారం (జనవరి 22)నాడు పెట్టనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వెల్లడించింది.

ఈడెన్‌లో ధోనికి సన్మానం: హాజరుకానున్న కుటుంబ సభ్యులు

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని ఏడు స్టాండ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా పేరు పెట్టనున్నట్లు శుక్రవారం క్యాబ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టేడియం ఉన్న ప్రాంతం ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉండడంతో ఇన్నాళ్లూ వారి అనుమతి కోసం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఎదురు చూడాల్సి వచ్చింది.

Sourav Ganguly stand at Eden Gardens to be unveiled during 3rd India-England ODI

తాజాగా వారి వద్దన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మొత్తం ఏడు స్టాండ్లకు గంగూలీతో పాటు దాల్మియా, పంకజ్‌ రాయ్, బీఎన్ దత్, ఎఎన్ ఘోష్, స్నేహాన్షు ఆచార్య పేర్లు పెట్టనున్నారు. ఇందులో భాగంగా కేఎల్ బ్లాకుకు దాల్మియా పేరుని పెడుతుండగా జీ, హెచ్ బ్లాకులకు బీఎన్ దత్, ఎఎన్ ఘోష్, పంకజ్‌ రాయ్, బీఎన్ దత్‌ల పేర్లలో ఎవరో ఒకరిది పెట్టనున్నట్లు తెలిపారు.

కోల్ కతా ఆసుపత్రిలో ధావన్: మూడో వన్డేకు దూరం?

కాగా తన కెరీర్‌లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన సౌరవ్‌ గంగూలీ, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని సన్మానించనున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఒక ప్రకటనలో పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X