న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

112 రన్స్‌కే ఆలౌట్: సఫారీల చేతిలో కివీస్ ఘోర ఓటమి

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: సఫారీల చేతిలో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (68), కెప్టెన్‌ ఏబీ డెవిలియర్స్‌ (85) పరుగులతో రాణించారు. అనంతరం 272 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. ఓపెనర్‌ లాథమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

South Africa crushes New Zealand by 159 runs in 3rd ODI

వరుసగా వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోరాట పటిమ కనబర్చకుండా పెవిలియన్ కు క్యూకట్టేసింది. కివీస్ జట్టులో గ్రాండ్ హోమ్(38 నాటౌట్), కేన్ విలియమ్సన్(28)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు.

ఏడుగురు కివీస్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో న్యూజిలాండ్ 32.2 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో 159 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ మూడు వికెట్లు సాధించగా, రబడా, పార్నెల్, పెహ్లుక్ వో లు తలో రెండు వికెట్లు తీశారు.

South Africa crushes New Zealand by 159 runs in 3rd ODI

తాజా విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో 2-1తో దక్షిణాఫ్రికా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డెవిలియర్స్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు' అందుకున్నాడు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X