న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: పాంటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన కెప్టెన్‌గా పాటింగ్ రికార్డుని సమం చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన కెప్టెన్‌గా పాటింగ్ రికార్డుని సమం చేశాడు. చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 164 పరుగులు సాధించాడు.

తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని సమం చేశాడు. 2006లో వాండార్స్ స్డేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో పాంటింగ్ 164 పరుగులు నమోదు చేసిన అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో స్మిత్ కూడా 164 పరుగులే చేయడం విశేషం.

వన్డేల్లో స్టీవ్ స్మిత్ అత్యధిక పరుగులు కూడా ఈ 164 కావడమే విశేషం. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్‌పై ఆసీస్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతక ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరిస్‌లో 0-5 తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 157 బంతుల్లో 164 పరుగులతో చెలరేగిపోయాడు. అతని కెరీర్‌లో ఇది ఏడో సెంచరీ. ఆ తర్వాత 325 పరుగలు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 44.2 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది.

Steven Smith equals Ricky Ponting’s ODI record, Australia crush New Zealand

మార్టిన్ గప్టిల్ 102 బంతుల్లో 114 పరుగులతో రాణించాడు. అతని కెరీర్‌లో ఇది పదకొండవ సెంచరీ. దీంతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ ఓపెనర్లు నమోదు చేసిన సెంచరీల సంఖ్య మూడుకు చేరింది. అంతక ముందు బ్రూస్ ఎడ్గర్ (102 నాటౌట్) సెంచరీ సాధించగా, నాథన్ ఆస్టల్ (104 నేపియర్)లో ఆస్ట్రేలియాపై సెంచరీలు చేసిన ఓపెనర్లుగా ఉన్నారు.

తాజా ఫలితంతో మూడో వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం కాన్‌బెర్రాలో జరగనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది అత్యధిక వన్డే వికెట్లు తీసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా గుర్తింపు పొందాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ ఏడాది 30 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో సహచర ఆటగాడు జాన్ హేస్టింగ్, ఇంగ్లండ్ స్సిన్నర్ ఆదిల్ రషిద్‌లు సాధించిన 29 వికెట్ల రికార్డును జంపా అధిగమించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X