న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్‌నెస్ లేదు: ప్రాక్టీస్ చేసినా, రెండో వన్డేకూ రైనా దూరం

By Nageshwara Rao

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్ రైనా రీ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్నా... ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో రెండో వన్డేకు కూడా దూరమయ్యాడు. వైరల్ ఫీవర్ కారణంగా తొలి వన్డేకి రైనా దూరమైన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా, ప్రస్తుతం వైరల్ ఫీవర్ నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని, అతను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనుందని బీసీసీఐ వైద్య బృందం తెలిపింది. దీంతో రైనాకు మరికొంత విశ్రాంతిని ఇచ్చామని జట్టు మేనేజ్‌మెంట్ మంగళవారం వెల్లడించింది.

 Suresh Raina practices in the nets but will still miss 2nd ODIagainst New Zealand

మంగళవారం జరిగిన నెట్‌ ప్రాక్టీస్‌లో రైనా 45 నిమిషాలు సాధన చేశాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌నెస్‌తో లేడని బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేసింది. అయితే నెట్స్‌లో హుషారుగా కనిపించిన రైనా.. స్పిన్నర్ల బౌలింగ్‌లో ల్యాఫ్టెడ్ షాట్స్ కొట్టాడు. రైనా స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం లేదని బోర్డు తెలిపింది.

కాగా, మంగళవారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌కు కొంత మంది ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు. అందరికంటే ఎక్కువసేపు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన ధోని.. కేదార్, జయంత్, ధావల్ బంతులను ఎదుర్కొన్నాడు. పేస్ బౌలింగ్‌లో పుల్‌షాట్స్ కొట్టడంపై ఎక్కువగా దృష్టిపెట్టాడు. ఆ తర్వాత రైనా కాసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్ చేశాడు.

 Suresh Raina practices in the nets but will still miss 2nd ODIagainst New Zealand

కుంబ్లే, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌లు విసిరిన త్రోడౌన్స్‌ను ప్రాక్టీస్ చేశాడు. జయంత్ యాదవ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ధోని, అతనికి మైదానంలో ఫీల్డింగ్ పొజిషన్లు వివరిస్తూ దానికి అనుగుణంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ ప్రాక్టీస్‌లో జయంత్ వివిధ రకాలుగా బంతులను ప్రాక్టీస్ చేశాడు.

మంగళవారం నాటి ప్రాక్టీస్‌కి వైస్ కెప్టెన్ కోహ్లీ, రహానే, బుమ్రా, హార్దిక్ పటేల్, ఉమేశ్‌ యాదవ్‌లు హాజరుకాలేదు. కాగా, బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా భారత-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో రైనా స్థానంలో జట్టులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా రాణించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X