న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 దేశాల్లో సెంచరీలు: చరిత్ర సృష్టించిన యూనిస్ ఖాన్

పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో పదకొండు దేశాల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో యూనిస్ ఖాన్‌కు ఇది 34వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో 39 ఏళ్ల యూనిస్ ఖాన్ భారత దిగ్గజ క్రికెటర్ సునీల గవాస్కర్ 34 టెస్టు సెంచరీ రికార్డుని సమం చేశాడు. 34 టెస్టు సెంచరీలతో గవాస్కర్, మహిళా జయవర్దనే, బ్రియాన్ లారాల సరసన యూనిస్ ఖాన్ చేరాడు.

ఆస్ట్రేలియా గడ్డపై యూనిస్ ఖాన్ చేసిన తొలి టెస్టు సెంచరీ కూడా ఇదే కావడం విశేషం. వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ 40 ఏళ్ల వయసులో బ్రిస్బేన్‌లో టెస్టు సెంచరీ చేయగా ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 39 ఏళ్ల వయసులో యూనిస్ ఖాన్ సెంచరీ సాధించాడు.

సిడ్నీ టెస్టుతో యూనిస్ ఖాన్ 11 దేశాల్లో 11 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 114 టెస్టులాడిన యూనిస్ ఖాన్ 9,789 పరుగులు చేశాడు. అంతకుముందు 10 టెస్టు హోదా కల్గిన దేశాల్లో భారత్‌కు చెందిన రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు.

Sydney Test: Younis Khan slams 34th Test century, equals Sunil Gavaskar's record

2004 డిసెంబర్‌లో చిట్టగ్యాంగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ 160 పరుగులు సాధించడంతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు గతంలో టెస్టు హోదా లేని యూఏఈలో కూడా యూనిస్ ఖాన్ సెంచరీ చేశాడు.

గురువారం మూడో రోజు ఆటలో భాగంగా 64 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన యూనిస్ ఖాన్ టీ విరామం అనంతరం సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు దుబాయిలో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు సిరిస్‌లో వెయ్యి టెస్టు పరుగులను యూనిస్ నమోదు చేశాడు.

దీంతో 12వ పాకిస్తానీ ఆటగాడిగా, మొత్తంగా చూస్తే 81వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 538/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 244 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది.

వివిధ దేశాల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్లు:

1. యూనిస్ ఖాన్ (పాకిస్థాన్) 11 సెంచరీలు
2. రాహుల్ ద్రవిడ్ (ఇండియా) 10 సెంచరీలు
3. మహిళా జయవర్దనే (శ్రీలంక) 10 సెంచరీలు
4. కుమార్ సంగక్కర (శ్రీలంక) 10 సెంచరీలు
5. మహ్మద్ యూసఫ్ (పాకిస్థాన్) 10 సెంచరీలు

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X