న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఓడినప్పటికీ... మిథాలీకి అరుదైన గౌరవం

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్‌ కప్‌ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్‌ కప్‌ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఉమెన్ వరల్డ్ కప్‌కి సంబంధించి మరిన్ని వార్తలు

ఈ వరల్డ్ కప్‌లో 34 ఏళ్ల మిథాలీ రాజ్ జట్టుని సమర్ధవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. అంతేకాదు బ్యాటింగ్‌లోనూ మిథాలీ అద్భుత ప్రదర్శన చేసింది. 409 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్‌గా నిలిచింది.

 Team of ICC Women's World Cup 2017 announced; Mithali Raj captain

అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.

తాజా వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు. బీమౌంట్, ష్రబ్‌సోల్‌, సారా టేలర్‌, అలెక్స్‌ హార్ట్లీకి చోటిచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి లారా వోల్‌వర్త్‌, మరిజన్నె క్యాప్‌, డేన్‌ వాన్‌ నికెర్క్‌, ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీలు చోటు దక్కించుకున్నారు.

మిథాలీ రాజ్, సారా టేలర్‌ ఐసీసీ జట్టుకు ఎంపికవ్వడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఆదివారం లార్డ్స్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో మిథాలీ సేన 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన మహిళ ప్రపంచకప్‌ జట్టు ఇది.. (బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రకారం):

1. Tamsin Beaumont (England) - 410 runs
2. Laura Wolvaardt (South Africa) - 324 runs
3. Mithali Raj (captain) (India) - 409 runs
4. Ellyse Perry (Australia) - 404 runs and nine wickets
5. Sarah Taylor (wicketkeeper) (England) - 396 runs, four catches and two stumpings
6. Harmanpreet Kaur (India) - 359 runs and 5 wickets
7. Deepti Sharma (India) - 216 runs and 12 wickets
8. Marizanne Kapp (South Africa) - 13 wickets
9. Dane van Niekerk (South Africa) - 99 runs and 15 wickets
10. Anya Shrubsole (England) - 12 wickets
11. Alex Hartley (England) - 10 wickets
Natalie Sciver (12th) (England) - 369 runs and 7 wickets

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X