న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, లక్ష్మణ్ ల గురించి గంగూలీ చెప్పిన సీక్రెట్స్ ; వాళ్లిద్దరూ అంత రఫ్ఫా! (ఫోటోలు)

కోల్ కతా : సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల మీద అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. అందుకే.. సెలబ్రిటీలకు సంబంధించినంత వరకూ ఎక్కువగా గాసిప్స్ ప్రచారంలో ఉంటాయి. గాసిప్స్ సంగతి పక్కనబెడితే.. సహచరుల నుంచే సదరు సెలబ్రిటీల విషయాలు బయటకు లీక్ అయ్యాయనుకోండి.. ఇక అభిమానుల చర్చలకు కావాల్సినంత స్టఫ్ దొరికినట్టే.

క్రికెట్ తర్వాత సచిన్ బిజీగా ఉండేది అందులోనే..

క్రికెట్ తర్వాత సచిన్ బిజీగా ఉండేది అందులోనే..

తాజాగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ తన సహచర క్రికెటర్ల గురించి చేసిన కామెంట్స్ ఇదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తావించిన గంగూలీ మాష్టర్ క్రికెట్ తర్వాత అంత బిజీగా ఉండేది షాపింగ్ లోనే అన్న తరహాలో సరదా వ్యాఖ్యలు చేశాడు.'సచిన్ కు దుస్తుల షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఓ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేశాడంటే.. మరుసటి రోజు షాపింగ్ లో బిజీ అయిపోతాడు. మంచి మంచి దుస్తులు అతని వార్డ్ రోబ్ లో ఉండేలా చూసుకుంటాడు' అని సచిన్ గురించి చెప్పుకొచ్చాడు గంగూలీ.

వీవీఎస్ లక్ష్మణ్.. వెరీ వెరీ లేట్..

వీవీఎస్ లక్ష్మణ్.. వెరీ వెరీ లేట్..

ఇక హైదరాబాదీ సొగసరీ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గంగూలీ. 'లక్ష్మణ్ ఎప్పుడూ లేటే.. ఆఖరికి నెం,4, నెం.5 బ్యాట్స్ మెన్ తర్వాత తానే క్రీజులోకి వెళ్లాల్సి ఉన్నా.. స్నానం చేస్తూ రిలాక్స్ అవుతుంటాడు. టీమ్ ఇండియా క్రికెట్ బస్సులో ఎప్పుడూ లాస్ట్ లో ఎక్కే వ్యక్తి లక్ష్మణ్' అని చెప్పాడు గంగూలీ.

సిద్దూ.. జడేజా.. చాలా రఫ్

సిద్దూ.. జడేజా.. చాలా రఫ్

ఇక టీమ్ ఇండియా లెజండరీ క్రికెటర్లలో ఒకరైన కపిల్ దేవ్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 70.80ల్లో భారత జట్టు ఆటతీరు సరిగా లేదని అన్నాడు. టెస్టుల్లో ఇంత త్వరగా నం.1 స్థానానికి చేరకుంటామని ఊహించలేదని అన్నాడు. ఇదే సందర్బంగా.. జడేజా, సిద్దూల గురించి ప్రస్తావిస్తూ.. మైదానం నుంచి బయటకొచ్చారంటే ఈ ఇద్దరూ చాలా రఫ్ గా వ్యవహరించేవారని చెప్పుకొచ్చాడు.

ఈడెన్ ముచ్చట్లు

ఈడెన్ ముచ్చట్లు

ఈడెన్ గార్డెన్ లో శుక్రవారం నాడు జరిగిన టాక్ షో సందర్బంగా.. మాజీ క్రికెటర్లు ఇలా తమ అనుభవాలను, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఎం.ఎస్ ధోని సినిమా విడుదలయ్యాక.. ధోని అభిమానులు చాలామంది థియేటర్లకు క్యూ కట్టారు. ధోని గురించి తెలియని విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం వాళ్లను థియేటర్ల వైపు అడుగులు వేయిస్తుంది. అంతలా.. క్రికెటర్ల వ్యక్తిగత విషయాలపై ఆసక్తి కనబరుస్తారు అభిమానులు. అందుకే ఇప్పుడు గంగూలీ, కపిల్ చేసిన కామెంట్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X