న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక-భారత్ టెస్టు సిరిస్: పూర్తి సమాచారం

By Nageswara Rao

గల్లె: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతారా లేదా చూడాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే. మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ టెస్టు సిరిస్‌లో పూర్తిస్దాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి బీసీసీఐ పగ్గాలు అప్పజెప్పింది. కోహ్లీ కూడా వార్మప్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ మంచి క్రికెట్‌ను ఆడేందుకు వచ్చామని పేర్కొన్నాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి పరీక్ష ఆగస్టు 12న ప్రారంభం కానుంది. శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌ గల్లేలో ఆరోజే ప్రారంభం కానుంది.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకలో టెస్టు సిరిస్ గనుక టీమిండియా నెగ్గితే టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో 1993లో టీమిండియా లంకపై 1-0తో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగు సార్లు టీమిండియా ప్రయత్నించినా శ్రీలంకపై విజయం సాధించలేదు.

The complete guide to Sri Lanka-India Test series 2015

ఇండియా - శ్రీలంక టెస్ట్ సిరిస్ పూర్తి సమాచారం:

మొత్తం ఎన్ని టెస్టులు, ఎక్కడెక్కడ?

* మొత్తం 3 టెస్టులు, ఆగస్టు 12న తొలి టెస్టు ప్రారంభం


భారత్‌లో ఏ టీవి ఛానల్ ప్రసారం చేస్తుంది?

* సోనీ సిక్స్ (English commentary) and సోనీ కిక్స్ (Hindi)


ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్, శ్రీలంక ఎక్కడెక్కడ?

* భారత్ - 5వ ర్యాంకు

* శ్రీలంక - 7వ ర్యాంకు


మూడు టెస్టు మ్యాచ్‌ల వేదికలు ఎక్కడ?

* తొలి టెస్టు - గల్లె అంతర్జాతీయ స్టేడియం, గల్లె

* రెండో టెస్టు - పి సారా ఓవల్, కొలంబో

* మూడో టెస్టు - సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో


మ్యాచ్ ప్రారంభం ఎన్ని గంటలకు?

* అన్ని మ్యాచ్‌లు కూడా ఉదయం 10 గంటలకు


శ్రీలంకలో భారత్ టెస్టు మ్యాచ్‌లో ఎప్పుడు విజయం సాధించింది?

* మహ్మాద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో 1993లో శ్రీలంకపై జరిగిన 3 టెస్టు మ్యాచ్‌ల్లో 1-0తో భారత్ విజయం సాధించింది.


గతంలో శ్రీలంకలో భారత్ ఎప్పుడెప్పుడు పర్యటించింది?

* 2010లో ధోని కెప్టెన్‌గా జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరిస్ డ్రాగా ముగిసింది.


గతంలో శ్రీలంకలో ఆడిన ఆటగాళ్లు ఎవరైనా ప్రస్తుత జట్టులో ఉన్నారా?

* హార్బజన్ సింగ్, ఇషాంత్ శర్మ, మురళీ విజయ్, అమిత్ మిశ్రా


ప్రస్తుత జట్టులో ఎక్కువ అనుభవం కలిగిన ఆటాగాడు?

* ప్రస్తుతం జట్టులో అత్యంత అనుభవం కలిగిన ఆటగాడిగా హార్భజన్ సింగ్ ఉన్నాడు. 102 టెస్టు మ్యాచ్‌లాడాడు. శ్రీలంకలో 9 టెస్టు మ్యాచ్‌లాడి 25 వికెట్లు తీసుకున్నాడు.


ఎవరైనా గాయాలతో ఉన్నారా?

* అవును. ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.


ఈ సిరిస్‌ను నిర్వహించడానికి గల కారణం?

* రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం శ్రీలంక క్రికెట్ లెజెండ్ కుమార సంగక్కర అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలనున్నాడు.


టెస్టు మ్యాచ్ పూర్తి షెడ్యూల్

* ఆగస్టు 12 నుంచి 16 వరకు (బుధవారం నుంచి ఆదివారం) - తొలి టెస్టు

* ఆగస్టు 20 నుంచి 24 వరకు (గురువారం నుంచి సోమవారం) - రెండో టెస్టు

* ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు (శుక్రవారం నుంచి మంగళవారం) - మూడో టెస్టు


జట్ల వివరాలు:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హర్భజన్ సింగ్, అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, వరుణ్ ఆరన్.

శ్రీలంక: ఏంజెలో మాథ్యూస్ (కెప్టెన్), లాహిరు తిరుమన్నే (వైస్-కెప్టెన్), కౌశల్ సిల్వా, దిముత్ కరుణరత్నే, కుమార్ సంగక్కర, దినేష్ చందిమల్, ఉపుల్ తరంగ, జెహన్ ముబారక్, కుశాల్ పెరెరా, రంగన్ హెరాత్, దిల్రువాన్ పెరెరా, తర్హిందు కౌశల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, దుష్మంత్ చుమీరా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X