న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిరీక్షణ ముగిసింది: ఏడాది తర్వాత జట్టులోకి స్టెయిన్

దాదాపు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: దాదాపు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. భుజం గాయంతో జట్టు నుంచి వైదొలిగిన స్టెయిన్‌ గత నవంబర్‌ 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు.

ఆ తర్వాత అతని భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆర్నెల్ల విశ్రాంతి అనంతరం తిరిగి ఆడొచ్చని భావించాడు. అయితే ఏడాది పాటు ఆటకు దూరం కావల్సి వచ్చింది. తాజాగా సుదీర్ఘ విశ్రాంతి అనంతరం తిరిగి బరిలోకి వచ్చేందుకు స్టెయిన్ ఉవ్విళ్లూరుతున్నాడు.

The wait is over! - Steyn teases comeback

ఈ మేరకు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పునరాగమనానికి సంబంధించి 'ఇక నిరీక్షణ ముగిసింది' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు స్టెయిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2004లో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టిన స్టెయిన్ ఇప్పటి వరకు 417 వికెట్లు తీశాడు.

The wait is over. 👊🏼

A post shared by 🔘 (@dalesteyn) on

కాగా, ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో దక్షిణాఫ్రికా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్ దూరం కావడంతో పాటు, మరో ఇద్దరు పేసర్లు ఫిలిండర్, క్రిస్ మోరిస్‌లను గాయాలు వేధిస్తున్నాయి. దీంతో ఇంగ్లండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Steyn: The wait is over
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X