న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ‌మ్మ‌త్తుగా అవుటయ్యాడు: టీ20లో ఇదే తొలిసారి (వీడియో)

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయ్ గమ్మత్తుగా అవుటయ్యాడు. ఫీల్డింగ్‌ను అడ్డుకున్నందుకు గాను అతడిని థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.

శుక్రవారం ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టౌటన్‌లోని కంట్రీ గ్రౌండ్‌లో రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ధాటిగా ఆడుతోంది. అప్పటికే 67 పరుగులు చేసిన జాసన్ రాయ్ దూకుడు మీదున్నాడు.

గమ్మత్తుగా అవుటైన జాసన్ రాయ్

ఈ సమయంలో 16వ ఓవర్‌లో అతడు గమ్మత్తుగా అవుటయ్యాడు. సఫారీల బౌలర్ క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో రాయ్ ఉన్నాడు. మోరిస్ వేసిన బంతిని లివింగ్‌స్టోన్‌ ఢిపెన్స్ ఆడాడు. అయితే నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్ నుంచి రాయ్ ప‌రుగు కోసం ముందుకు ఉరికాడు.

వెన‌క్కి ప‌రిగెత్తిన జాసన్ రాయ్

వెన‌క్కి ప‌రిగెత్తిన జాసన్ రాయ్

దీనిని గమనించిన లివింగ్‌స్టోన్ అత‌న్ని వెన‌క్కి వెళ్లాలని సూచించాడు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ వెన‌క్కి ప‌రిగెత్తిన జాసన్ రాయ్... దక్షిణాఫ్రికా ఫీల్డర్ ఫెహ‌లుక్‌వ‌యో వేసిన‌ త్రో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఫెహ‌లుక్‌వ‌యో వేసిన త్రో నేరుగా వికెట్ల వైపు దూసుకెళ్లింది. అయితే మధ్యలో పరుగు కోసం వెళ్లి తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో రాయ్ వికెట్ల వైపు దూసుకొస్తున్న బంతి అతడి కాలికి తగిలింది.

థర్డ్ అంపైర్‌కు అపీల్

థర్డ్ అంపైర్‌కు అపీల్

దీంతో మోరిస్ అంపైర్‌కు అపీల్ చేశాడు. మొద‌ట గ్రౌండ్ అంపైర్లు ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్ర‌క‌టించారు. ఫీల్డింగ్ అడ్డుకున్న జాయ్‌ను అవుట్‌గా ప్రకటించాలని బౌల‌ర్ మోరిస్ అపీల్‌కు వెళ్లాడు. దీంతో ఈ స‌మ‌స్య‌ను థర్డ్ అంపైర్‌ రాబిన్సన్‌కు రిఫ‌ర్ చేశారు. అయితే చాలా స‌మయం తీసుకున్న థర్డ్ అంపైర్‌ రాబిన్సన్... జాసన్ రాయ్ అవుటైన‌ట్లు ప్ర‌క‌టించాడు. రాయ్ అవుటైన తర్వాత వరుస వికెట్లను కోల్పోయి ఇంగ్లాండ్ ఆలౌటైంది.

గతంలో పలువురు క్రికెటర్లు ఇలా

గతంలో పలువురు క్రికెటర్లు ఇలా

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే టీ20ల్లో ఫీల్డ‌ింగ్‌ను అడ్డుకున్నందుకు గాను అవుటైన తొలి అంతర్జాతీయ క్రికెట‌ర్‌గా జాసన్ రాయ్ నిలిచాడు. అయితే గతంలో ఇలా పలువురు క్రికెటర్లు అవుటైన సందర్భాలు అనేకం ఉన్నాయి.

1. రమీజ్ రాజా (Pakistan) Vs England - 1987 (Karachi)

2. మొహిందర్ అమర్నాధ్ (India) Vs Sri Lanka - 1989 (Ahmedabad)

3. ఇంజమాముల్ హక్ (Pakistan) Vs India - 2006 (Peshawar)

4. మహ్మద్ హఫీజ్ (Pakistan) Vs South Africa - 2013 (Durban)

5. అన్వర్ అలీ (Pakistan) Vs South Africa - 2013 (Port Elizabeth)

6. బెన్ స్టోక్స్ (England) Vs Australia - 2015 (Lord's, London)

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X