బెంగళూరు: రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా.. రుణాలు చెల్లించే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఆయన తిలకించారు.
లండన్‌లో ఉంటున్న అతను తన కొడుకుతో కలిసి మ్యాచును వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అంతకుముందు వారు.. గో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటూ కనిపించారు.
ఒంటరిగా పార్టీ చేసుకున్న క్రిస్ గేల్
ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. ఆ మ్యాచ్ అనంతరం బెంగళూరు ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు. అయితే, క్రిస్ గేల్ మాత్రం పార్టీ చేసుకున్నాడు.
ఎవరైనా పార్టీ చేసుకోవాలంటే స్నేహితులు, బంధువులు ఉండాలి. కానీ ఐపీఎల్లో ఓడిన గేల్.. దానిని తేలిగ్గా తీసుకున్నట్లున్నాడు. పార్టీ చేసుకునేందుకు టీం సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో అతను ఒక్కడే ఒంటరిగా పార్టీ చేసుకున్నాడు.
గేల్‌తో పాటు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నప్పటికీ కేవలం గేల్ డ్యాన్స్‌ను మాత్రమే చూస్తూ ఉండిపోయాడని తెలుస్తోంది. తన ఒంటరి పార్టీ వీడియోను గేల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. 'నిన్న భారత్‌లో డ్యాన్స్ చేశా, నేడు లండన్‌లో చేస్తా. మిస్ యూ సర్ఫరాజ్.. దృఢంగా ఉండు. నా నృత్యం చూసి పాఠాలు నేర్చుకో అని ట్యాగ్ లైన్ పెట్టాడు' పెట్టాడు.