న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బేటా భారత జట్టుకు సెలక్ట్ అయ్యావు: గవాస్కర్‌కి చెప్పిన మన్కడే

నలభై సంవత్సరాల క్రితం తాను భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పింది టీమిండియా మాజీ ఆల్ రౌండర్, తన సహచరుడి కోచ్ వినూ మన్కడేనని మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్‌ గవాస్కర్‌ గుర్తు చేసుకున్నాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: నలభై సంవత్సరాల క్రితం తాను భారత జట్టుకు ఎంపికయ్యానని చెప్పింది టీమిండియా మాజీ ఆల్ రౌండర్, తన సహచరుడి కోచ్ వినూ మన్కడేనని మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్‌ గవాస్కర్‌ గుర్తు చేసుకున్నాడు.

బుధవారం రాత్రి లెజెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వినూ మన్కడ్‌ 100వ జయంతి వేడుకలకు హాజరైన సునీల్ గవాస్కర్ ఆయనతో గడిపిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరువేసుకున్నాడు.

1917 ఏప్రిల్‌ 12న గుజరాత్‌లోని జామ్ నగర్‌లో వినూ మన్కడ్ జన్మించాడు. వినూ మన్కడ్‌ టీమిండియా తరుపున 44 టెస్టులు ఆడి 2,109 పరుగులతో 162 వికెట్లు తీసుకున్నాడు. నలబై ఏళ్ల క్రితం దాదర్ స్టేషన్‌కు సమీపంలోని మా ఇంటికి వెళ్తుండగా నాకు తియ్యని వార్తని మా గురువు వినుమన్కడ్‌ ఫోన్‌లో వినిపించారని సన్నీ తెలిపాడు.

Vinoo Mankad told me I was selected for Team India, recalls Sunil Gavaskar

'ఇంట్లోకి వెళ్లేందుకు తలుపు కొట్టాను. వెంటనే అమ్మ ఎదురుగా ఎంతో ఆతృతగా నావైపు చూసింది. వినూ భాయ్‌ ఫోన్‌లో బెటా నువ్వు భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యావు, ఫ్రీగా బ్యాటింగ్‌ చేయి' అన్న మాటలను సునీల్ గవాస్కర్ ఈ ఫంక్షన్‌లో గుర్తు చేసుకున్నాడు.

ఈ మాటలు నాకెంతో సంతోషం కల్గించాయని గవాస్కర్‌ పేర్కొన్నాడు. అనంతరం ఫోన్‌ని తన సహచర ఆటగాడు అశోక్ మన్కడ్‌కి ఇచ్చానని గవాస్కర్ తెలిపాడు. గవాస్కర్‌ 1971లో వెస్టిండీస్‌ పర్యటనకు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.

ఆ పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ సైతం వినూ మన్కడ్‌ గురించి గొప్పగా చెప్పాడని భారత్‌ తరుపున 125 టెస్టులు ఆడి 10,122 పరుగులు చేసిన గవాస్కర్‌ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్లు అజిత్‌ వాడెకర్‌, వాసు పరాంజపే , మాధవ్‌ ఆప్టే, సలీం దురాణీలు హాజరయ్యారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X