న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ బ్యాట్స్‌మెన్, ఏబీ సూపర్‌మెన్: గేల్ రికార్డ్ బద్దలు

By Srinivas

బెంగళూరు: తన జట్టు సహచర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీయర్స్‌ల పైన స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ, డివిల్లీయర్స్‌లను బ్యాట్‌మన్, సూపర్ మెన్‌లుగా అభివర్ణించాడు. కోహ్లీని బ్యాట్సుమెన్ అని, డివిల్లీయర్స్‌ను సూపర్ మెన్‌తో పోల్చాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ మూడు సెంచరీలు చేసి ఐపీఎల్ ఒకే సీజన్లో మూడు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. వయసు పెరుగుతున్నా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా క్రికెట్ సంచలనం ఏబీ డివిలియర్స్. కోహ్లీకి తీసిపోని విధంగా ఆడుతున్నాడు.

Virat Kohli and AB de Villiers are like 'Batman Superman': Chris Gayle

వీరిద్దరి ప్రతాపం ముందు పించ్ హిట్టర్ గా పేరున్న విండీస్ సంచలనం గేల్ వెలవెలబోతున్నాడు. ఈ నేపథ్యంలో గేల్ సహచర క్రికెటర్లు కోహ్లీ, డివిలియర్స్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లీ, డివిల్లీయర్స్‌లు 12 మ్యాచులలో 1,329 పరుగులు చేశారు.

గేల్ రికార్డ్‌లు బద్దలు కొట్టిన కోహ్లీ

విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో రికార్డ్ సాధించాడు. క్రిస్ గేల్ రికార్డులు బద్దలు కొట్టాడు. కోహ్లీ ఐపీఎల్లో 24వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ బద్దలు కొట్టాడు. 12 మ్యాచుల్లో కోహ్లీ ఇప్పటి దాకా 752 పరుగులు చేశాడు. మరో రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. గతంలో ఈ రికార్డ్ గేల్ పేరిట ఉంది. గేల్ గతంలో 733 పరుగులు ఒకే సీజన్లో చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X