న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ-కుంబ్లే కలయిక అదుర్స్: మాజీ కోచ్ చాపెల్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియాకు అనిల్ కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడాన్ని సరైన నిర్ణయంగా చాపెల్ అభిప్రాయపడ్డాడు.

డ్రెస్సింగ్ రూంలో కుంబ్లే అందుబాటులో ఉండటం టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్కిన అదృష్టంగా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేల కలయికలో భారత జట్టు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోవడం ఖాయమని చెప్పాడు.

హెడ్‌కోచ్‌గా కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా శాస్త్రి: కోహ్లీ చక్రం!హెడ్‌కోచ్‌గా కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా శాస్త్రి: కోహ్లీ చక్రం!

'టీమిండియా కోచ్‌గా కుంబ్లే నియామకం సరైనదే. కుంబ్లేతో కలిసి పని చేయడం విరాట్‌కు దక్కిన అదృష్టం. కుంబ్లేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పంచుకోవడం విరాట్‌కు దక్కిన ఒక మంచి అవకాశం. విరాట్ దూకుడుకు కుంబ్లే అనుభవం సహాయ పడుతుంది. వీరిద్దరి భాగస్వామ్యం ఖచ్చితంగా భారత జట్టును ముందుకు తీసుకెళుతుంది. కుంబ్లే-విరాట్‌ల కాంబినేషన్ విజయవంతమవడం ఖాయం. కుంబ్లే నుంచి విరాట్‌కు చక్కటి సహకారం లభిస్తుంది. ప్రతీ విషయంలోనూ విరాట్‌ను కుంబ్లే వెనుకుండి ప్రోత్సహిస్తాడు' అని ద హిందూకి రాసిన కాలమ్‌లో చాపెల్ పేర్కొన్నాడు.

Virat Kohli-Anil Kumble combination will be potent for India: Greg Chappell

కుంబ్లేపై చాపెల్ మంచి ధోరణిని కలిగి ఉన్నాడు. 2005 నుంచి 2007 మధ్య కాలంలో తాను టీమిండియా కోచ్‌గా పని చేసినప్పుడు కుంబ్లే పోరాట పటిమను అత్యంత దగ్గరగా చూశానని చాపెల్ పేర్కొన్నాడు. ఎంతో అంకితభావం గల కుంబ్లే టీమిండియా కోచ్‌గా రాణిస్తాడని తెలిపాడు.

వేరే ఇతర ఆటలతో పోలిస్తే క్రికెట్‌కు కోచ్ చాలా తేడా ఉంటుదని అన్నాడు. మైదానం వెలుపల ఇద్దరి ప్రమేయం ఉన్నప్పటికీ, మైదానంలో మాత్రం కెప్టెన్ బాస్‌గా వ్యవహారిస్తాడు. క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే కోహ్లీ తన సహచర ఆటగాళ్లకు ఒక రోల్ మోడల్‌గా ఉంటాడని కోహ్లీపై చాపెల్ ప్రశంసలు కురిపించాడు.

టీమిండియా కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి 21 మంది మాత్రమే ఇంటర్యూకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిలో కేవలం పది మందికి మాత్రమే క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్యూని నిర్వహించింది.

ఈ ఇంటర్యూకు భారత మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, ప్రవీణ్‌ ఆమ్రే, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌‌లతో పాటు రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ పేసర్ టామ్ మూడీ, స్టువర్ట్ లాలు హాజరవ్వగా వీరిలో ప్రధాన కోచ్‌‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X