న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘డాన్‌’ని పట్టెస్తాడు: కోహ్లీపై సెహ్వాగ్ ఆసక్తికరం, సిగ్గేస్తుందని ఫించ్!

ముంబై/న్యూఢిల్లీ: ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫాంలో కొనసాగుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం క్రికెటర్లతోపాటు, మాజీ ఆటగాళ్లు అతణ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా కోహ్లీ గురించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. 'డాన్‌ను పట్టుకోవడం కేవలం కష్టమే కాదు. అసాధ్యం కూడా!' అని ఓ ప్రముఖ హిందీ సినిమా డైలాగ్ చెప్పిన సెహ్వాగ్.. 'కానీ కోహ్లి చేజింగ్‌ ఎలా ఉంటుందంటే.. అతడు డాన్‌ను కూడా పట్టుకోగలడు' అని అన్నాడు.

కాగా, సెహ్వాగ్‌ ఉద్దేశంలో డాన్‌ అంటే ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ అని కొందరు అర్థాలు చెబుతుండటం విశేషం.

 Virat Kohli Can Chase The 'Don': Virender Sehwag's Funny Tweet Linking Big B Blockbuster

బ్యాటింగ్ అంటే అంత ఈజీనా: ఫించ్ అసూయ

ఇక మరీ ఈ స్థాయిలో ఆడటం ఆపేయాలని కోహ్లిని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ బతిమాలుకున్నాడు. 'ప్రియమైన విరాట్‌.. బ్యాటింగ్‌ మరీ ఇంత తేలికా అన్నట్టు ఆడటం దయచేసి ఆపుతావా? మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఇది సిగ్గుగా ఉంది' అని ఆరోన్ ఫించ్‌ అన్నాడు.

ఏ విధ్వంసక బ్యాట్స్ మన్‌కు సాధ్యం కాని రికార్డులు తిరగరాస్తున్నాడు కోహ్లీ. ఒకే సీజన్లో 4 సెంచరీలు బాది అతడు బౌలర్లతో పాటు బ్యాట్స్ మన్లకు ఓ పెద్ద సవాలుగా మారాడు. ఈ సీజన్లో ఇప్పటికే 865 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు కోహ్లీ. రెండో స్థానంలో ఉన్న సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ రన్స్, కోహ్లీ పరుగుల వ్యత్యాసం 268 ఉండటం అతడు చెలరేగిన తీరును స్పష్టం చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఫించ్ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, 'ఈ సమయంలో రాళ్లు విసిరినా.. కోహ్లీకి గాలి బుడగల్లా కనిస్తాయి. అతడికి అడ్డే లేదు' అని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ ఇటీవల కొనియాడటం గమనార్హం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X