న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతం, సచిన్‌లా గొప్ప ఆటగాడు: కోహ్లీపై హస్సీ

మెల్బోర్న్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ దిగ్గజం మైకేల్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దారిలోనే కోహ్లీ తన ఆటను కొనసాగిస్తున్నాడని తెలిపాడు. తొందరలోనే సచిన్ రికార్డులను సమం చేయడమో లేదా వాటిని బ్రేక్ చేయడమో చేస్తాడని చెప్పాడు.

'టెండూల్కర్ గొప్ప బలమేమిటంటే ఆయన స్థిరత్వం. ఫిట్‌గా ఉండటం. అందువల్లే ఎక్కువ కాలంపాటు సచిన్ క్రికెట్ కెరీర్ కొనసాగించగలిగాడు. కోహ్లీ కూడా అలాగే ఫిట్‌గా ఉంటే.. సచిన్ టెండూల్కర్ మరిపిస్తాడు' అని హస్సీ పేర్కొన్నాడు.

'కోహ్లీ ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఫాంను కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్ లో అతని ఆట అద్భుతం. ఒకే సీజన్లో 4 సెంచరీలు చేయడం సాధారణ విషయం కాదు' అని హస్సీ తెలిపాడు. కోహ్లీ ఒక అద్భుత ఆటగాడని, ఏబి డివిలియర్స్, స్టీవ్ స్మిత్ అతని సమకాలీనులని అన్నాడు.

Virat Kohli can emulate Sachin Tendulkar, says Michael Hussey

సచిన్‌ను మించిపోతాడు: డొమినిక్

భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో సచిన్ కంటే కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడని తాజాగా ఇంగ్లాండ్ మాజీ పేస్ బౌలర్ డొమినిక్ కార్క్ అన్నాడు. వన్డేల్లో మాస్టర్ సచిన్ సాధించిన అన్ని రికార్డులనూ కోహ్లీ తిరగరాస్తాడని, ఏకంగా సచిన్ కంటే అతనే గొప్ప అని తెలిపాడు.

'సచిన్ కంటే కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. గొప్పమాట అనిపించినా కోహ్లీ ఆటతీరు చూస్తే అతనికి ఆ సామర్థ్యం ఉందనిపిస్తున్నది. వేదిక ఏదైనా.. బౌలర్ ఎలాంటివాడైనా అలవోకగా ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పాటిస్తున్నాడు. కచ్చితంగా అతను సచిన్ కంటే గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు' అని కార్క్ అన్నాడు.

ఇది ఇలా ఉండగా, న్యూజిలాండ్ కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కానే విలియమ్సన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆట తీరును కనబరిచే కోహ్లీ గొప్ప ఆటగాడు. తాను ఎంతగానో ఆరాధించే ఆటగాళ్లో కోహ్లీ ఒకరని అన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X