న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎక్కడైనా ఆటగలడు: కోహ్లీకి పెరుగుతున్న మద్దతు

కోహ్లీకి మాజీ కెప్టెన్ క్రికెట్ దిగ్గజం కపిల్ వేద్ మద్దతు పలికాడు. కోహ్లీ ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడని కపిల్‌ వ్యాఖ్యానించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ పేసర్ ఆండర్సన్ చేసిన విమర్శలపై మాజీలు మండిపడుతూనే ఉన్నారు. తాజాగా కోహ్లీకి మాజీ కెప్టెన్ క్రికెట్ దిగ్గజం కపిల్ వేద్ మద్దతు పలికాడు. కోహ్లీ ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడని కపిల్‌ వ్యాఖ్యానించాడు.

కోహ్లి ఆటలో మార్పు వచ్చిందని అనుకోవట్లేదుని, అతడి బ్యాటింగ్‌లో లోపాలు ఇక్కడి పిచ్‌లపై కనిపించడం లేదని. పిచ్‌ల్లో వేగం, స్వింగ్‌ లేకపోవడం వల్లే ఇంగ్లాండ్‌లో మాదిరిగా అతడిని ఔట్‌ చేయలేపోయామని కోహ్లీపై అండర్సన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలను కపిల్ తీవ్రంగా తప్పుబట్టాడు. 'కోహ్లీ ఇంగ్లాండ్‌తో సహా ఏ దేశంలోనైనా ఆడతాడు, ఆడగలడు. అన్ని పరిస్థితుల్లోనూ అతను చక్కగా ఆడగలడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంత గొప్ప క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది' అని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌ అన్నారు.

Virat Kohli

'ఇప్పటివరకు ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్‌ను నేను చూడలేదు. రికార్డులు చూస్తే తెలుస్తుంది అతనేంటో. ఇప్పటికే 50కి పైగా సగటుతో మూడు ఫార్మాట్లలో కలిపి 41 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడు' అని ఈ కపిల్ చెప్పాడు.

ఆ పిచ్‌పై డబుల్: ఆండర్సన్‌పై సన్నీ ఫైర్, కోహ్లికి మద్దతుఆ పిచ్‌పై డబుల్: ఆండర్సన్‌పై సన్నీ ఫైర్, కోహ్లికి మద్దతు

కోహ్లీపై అండర్సన్‌ చేసిన వ్యాఖ్యలను పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌ కూడా తప్పుబట్టాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను విమర్శించే ముందు భారత్‌లో వికెట్లు ఎలా తీయాలో తెలుసుకుంటే మంచిదని ఇంజమామ్ సూచించాడు. అంతేకాదు ఆండర్సన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్నాడు.

'కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌ను విమర్శిస్తూ అండర్సన్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. కోహ్లీను ప్రశ్నించే ముందు నువ్వు భారత్‌లో వికెట్లు తీసే పాఠాలు నేర్చుకుంటే మంచిది. ఇప్పటివరకూ అండర్సన్ భారత్ లో వికెట్లు తీయడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒక బ్యాట్స్‌మన్ టెక్నిక్‌ను ప్రశ్నించే స్థాయిలో నీవు ఉన్నావా అనేది తెలుసుకుని ఆ తరువాత మాట్లాడు' అని జియో స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు.

కోహ్లీని విమర్శించే స్థాయి నీకు ఉందా?: ఆండర్సన్‌పై హక్కోహ్లీని విమర్శించే స్థాయి నీకు ఉందా?: ఆండర్సన్‌పై హక్

'నా బౌలింగ్‌ను ఇంగ్లండ్‌లో కోహ్లీ ఎదుర్కోలేకపోయాడన్నావు. ఇంగ్లాండ్‌లో ఆడితేనే నాణ్యమైన బ్యాట్స్‌మన్ అని సర్టిఫికెట్ ఇస్తారా? ఉప ఖండం పిచ్‌ల్లో ఆడేటప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడకపోతేనే మంచిది. ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసే విదేశీ ఆటగాళ్లకు నేనిచ్చే సూచన మాత్రమే. ఒక ఆటగాడు ఎక్కడ పరుగులు చేసినా వాటిని పరుగుల గానీ పరిగణిస్తారని విషయం బోధ పడితే మంచిది' అని ఇంజమామ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X