న్యూఢిల్లీ: దేశీయ పుట్బాల్ సిరిస్ 'ప్రీమియర్ ఫుట్సల్ లీగ్'కు సంబంధించి అధికారిక వీడియో గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ విడుదల చేశారు. గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.
'ప్రీమియర్ ఫుట్సల్ లీగ్' పేరిట ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాలతో కూడిన దేశీయ ఫుట్ బాల్ సిరీస్ జులై 15 నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 'నామ్ హై పుట్సల్' అంటూ సాగే ఈ వీడియో గీతంలో ఏఆర్ రెహామాన్తో పాటు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశారు.
Futsal Anthem - featuring Virat Kohli https://t.co/vWJprlGytI
— A.R.Rahman (@arrahman) July 7, 2016
ఈ సిరీస్కు బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లీ వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్కు సంబంధించి ప్రమోషనల్ గీతాన్ని ఏఆర్ రెహ్మాన్ స్వరాలను సమకూర్చారు. దీంతో ఏఆర్ రెహ్మాన్ ఆహ్వానం మేరకు ఆయన స్టూడియోకు వెళ్లిన కోహ్లీ... త్వరలో ప్రారంభం కానున్నా 'ప్రీమియర్ ఫుట్సల్ లీగ్' కోసం పాట పాడారు.
ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకే కెప్టెన్ విరాట్ కోహ్లీ పాట పాడటం విశేషం. భారత్లో జరిగే ఓ పుట్బాల్ సిరిస్ కోసం మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహామాన్ ఓ పాటను కంపోజ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ పుట్బాల్ సిరిస్పై ఇప్పటకే అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.